
వెధవలే దిష్టిబొమ్మలు తగులబెట్టారు
డాక్ సేవక్ సభలో రాష్ట్ర హోంమంత్రి నాయిని
హన్మకొండ అర్బన్ (వరంగల్ అర్బన్ జిల్లా): ‘కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేస్తామంటే కొందరు పనికిరాని వెధవలు కోర్టుల్లో కేసులు వేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. అలాంటి వారివల్లే రెగ్యులరైజేషన్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది’ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. హన్మకొండలో ఆదివారం జరిగిన ఆలిండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ మూడో ద్వైవార్షిక మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అన్నారు.