Nani Narsimha Reddy
-
వెధవలే దిష్టిబొమ్మలు తగులబెట్టారు
డాక్ సేవక్ సభలో రాష్ట్ర హోంమంత్రి నాయిని హన్మకొండ అర్బన్ (వరంగల్ అర్బన్ జిల్లా): ‘కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేస్తామంటే కొందరు పనికిరాని వెధవలు కోర్టుల్లో కేసులు వేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. అలాంటి వారివల్లే రెగ్యులరైజేషన్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది’ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. హన్మకొండలో ఆదివారం జరిగిన ఆలిండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ మూడో ద్వైవార్షిక మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అన్నారు. -
సంక్షేమ పథకాల అమలులో మనమే నంబర్‌వన్
హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: సంక్షేమ పథకాలు అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని.. ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బొంగ్లూర్ గేటు సమీపంలో ఓ పంక్షన్ హాల్ ప్రారంభ కార్యక్రమానికి హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ,ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు హాజరయ్యారు. ఫంక్షన్ హాల్ ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హోంమంత్రి మాట్లాడుతూ కుల,మత, వర్గ విభేదాలు లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. అందరి అండదండలు, ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా బంగారు తెలంగాణ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రజలకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. వినియోగదారులకు ఇబ్బందులు కల్గించకుండా వసతులు కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు డబ్బీకార్ శ్రీనివాస్, కొత్త ఆశోక్‌గౌడ్, పోరెడ్డి నర్సింహారెడ్డి, మంగళ్‌పల్లి సర్పంచ్ అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ధర్నా చౌక్‌ను ఇంకా తొలగించలేదు
హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సాక్షి, సిద్దిపేట: హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను తొలగించేందుకు ఇంకా ఎలాంటి అనుమతి ఇవ్వలేదని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రతిపక్షాలకు ఏమీ దొరక్క ధర్నా చౌక్ అంశాన్ని పట్టుకొని రాద్దాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభ కోసం శనివారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్నాచౌక్ కంటే మంచి ప్రదేశం దొరికితే అక్కడ ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నామని అన్నారు.