
ధర్నా చౌక్‌ను ఇంకా తొలగించలేదు
హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి
సాక్షి, సిద్దిపేట: హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను తొలగించేందుకు ఇంకా ఎలాంటి అనుమతి ఇవ్వలేదని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.
ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రతిపక్షాలకు ఏమీ దొరక్క ధర్నా చౌక్ అంశాన్ని పట్టుకొని రాద్దాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభ కోసం శనివారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్నాచౌక్ కంటే మంచి ప్రదేశం దొరికితే అక్కడ ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నామని అన్నారు.