పాదయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నాయీ బ్రాహ్మణుల సేవా సంఘం రాష్ట్ర హడ్‌హక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాదయాత్ర కరపత్రాన్ని సోమ వారం రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సేవా సంఘం హడ్‌హక్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... నాయీ బ్రాహ్మణుల హక్కుల సాధన కోసం ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 1న జోగులాంబ గద్వాల నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. 12 రోజుల పాటు ఈ పాదయాత్ర వివిధ జిల్లాల గుండా నగరంలోని ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు సాగుతుందన్నారు.
ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నాయీ బ్రాహ్మణుడికి నవీన కౌరశాల నిర్మాణానికి రూ. 25 వేలు, ప్రతి షాపునకు డొమెస్టిక్ విద్యుత్ మీటర్లుగా మార్చడం, 50 సంవత్సరాలు దాటిన వాయిద్య కళాకారులకు పింఛన్, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు, ఫెడరేషన్ ద్వారా 90 శాతం సబ్సిడీతో రుణాలు, నాయీ బ్రాహ్మణులకు చట్ట సభలతో పాటు ఇతర నామినేషన్ పోస్టులలో అవకాశం, నగరంలో విద్యార్థి వసతి గృహం, జిల్లా, మండల హెడ్ క్వార్టర్స్‌లో భవనాలు, నాయీ బ్రాహ్మణ యువతీయువకులకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ తదితర డిమాండ్ల సాధన కోసం ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు.
జోగులాంబ దేవాలయం నుంచి ఆయిజా, గద్వాల్, ఎర్రవల్లి, బీచ్‌పల్లి, పెబెర్, వనపర్తి, కొత్తకోట, భూత్‌పూర్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, బాలానగర్, షాద్‌నగర్, శంషాబాద్, అత్తాపూర్ మీదుగా ఈ పాదయాత్ర సాగనుందన్నారు. ఈ కార్యక్రమంలో హడ్‌హక్ కమిటీ సభ్యులు బి.నరేందర్, సూర్యనారాయణ, మోహన్, జగదీష్, వాసు, గడ్డం మోహన్, పాల్వాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment