పథకం ప్రకారమే రాములు హత్య | Nayeem gang murdes ramulu with pre plan | Sakshi
Sakshi News home page

పథకం ప్రకారమే రాములు హత్య

Published Thu, May 22 2014 1:18 PM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

హత్యకు గురైన రాములు ఫైల్ ఫొటో - Sakshi

హత్యకు గురైన రాములు ఫైల్ ఫొటో

నల్గొండ: దివంగత మాజీ మావోయిస్ట్ సాంబశివుడు సోదరుడు కోనపురి రాములు హత్య కేసు నిందితులను నల్గొండ జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ  పథకం ప్రకారమే కోనపురి రాములును నయీం ముఠా సభ్యులు హత్య చేసినట్లు చెప్పారు.  హత్య చేయడంలో మొత్తం 10మంది పాల్గొన్నట్లు తెలిపారు.

హత్య చేసిన తరువాత  నిందితులు కేరళ పారిపోయినట్లు చెప్పారు. అక్కడి పోలీసుల సాయంతో నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు నయీం కోసం ప్రత్యేక టీమ్‌ను రంగంలోకి దింపినట్లు ఆయన చెప్పారు. త్వరలోనే ప్రధాన నిందితుడు నయీంను పట్టుకుంటామని ఎస్పీ ప్రభాకర్‌రావు ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement