
కార్మికులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు
మెదక్:అవినీతికి పాల్పడుతూ కార్మికులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. గురువారం ఆందోల్ మండలం నాదులాపూర్ లోని క్వారీని నాయిని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నాయిని..అవినీతికి పాల్పడుతూ కార్మికులపై వేధింపులకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. మహారాష్ట్రకు చెందిన కాంట్రాక్ట్ లేబర్ బాధితులను తిరిగి రంగారెడ్డి జిల్లా కొండాపూర్ కు తరలించి ఉపాధి కల్పిస్తామన్నారు.