
టీఆర్‌ఎస్‌లో చేరిన నేతి విద్యాసాగర్
హైదరాబాద్: శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. నేతి విద్యాసాగర్, ఆయన అనుచరులు సీఎం క్యాంపు కార్యాలయానికి రాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు.
కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్‌రావు కూడా రెండు మూడు రోజుల్లో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారని సమాచారం. శాసనమండలి చైర్మన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన స్వామిగౌడ్‌కు నేతి విద్యాసాగర్‌తో పాటు రాజేశ్వర్‌రావు కూడా ఓటేసిన సంగతి విదితమే.