కొమురం భీం పేరుతో కొత్త జిల్లా: కేసీఆర్
ఆదిలాబాద్: ఆదివాసీ యోధుడు కొమురం భీం పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీయిచ్చారు. జోడేఘాట్ లో బుధవారం జరిగిన కొమురం భీం వర్థంతి సభలో ఆయన ప్రసంగించారు. ఆదిలాబాద్ ను తెలంగాణ కాశ్మీర్ గా అబివృద్ధి చేస్తామన్నారు. కొమురం భీం త్యాగాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు.
కొమురం భీం కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆయన మనవడు, మనరాలికి ఉద్యోగం ఇస్తామన్నారు. కొమురం భీం పేరుతో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, 100 ఎకరాల్లో పర్యాటక ప్రాంతం అభివృద్ధి చేస్తామన్నారు.