ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యానికి నిలయంగా మారింది.
నల్లగొండ: ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యానికి నిలయంగా మారింది. అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందిన ఘటన జిల్లాలోని ఒక ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. ప్రసవం నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన గర్భిణిని వైద్యులు పట్టించుకోక పోవడంతో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మరణించిందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి వద్ద వారు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.