
సాక్షి, హైదరాబాద్: నాలుగో విడత మిషన్ కాకతీయ కింద చేపట్టదలచుకున్న చెరువుల అనుమతులు, పునరుద్ధరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం ఒకేసారి 149 చెరువుల పునరుద్ధరణకు రూ.45 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. మరో 10 కొత్త చెరువుల నిర్మాణానికి గాను రూ.15.59 కోట్లు మంజూరు చేసింది. ఈ కొత్త చెరువుల్లో సంగారెడ్డి జిల్లాలోనే 8 ఉండగా వాటికి రూ.13 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలో 2 కొత్త చెరువుల నిర్మాణానికి రూ.2.59 కోట్లు కేటాయించింది.
ఇక పునరుద్ధరణకు సంబంధించి నిర్మల్, మంచిర్యాల జిల్లాలో 18 చెరువులకు రూ. 5.4 కోట్లు, ఖమ్మం జిల్లాలో 11 చెరువులకు రూ.2.18 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 చెరువులకు రూ.4.82 కోట్లు, మహబూబాబాద్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో చెరువుల పునరుద్ధరణకు రూ.5.3 కోట్ల మేర ప్రభుత్వం కేటాయించింది. ఈ పనులకు సత్వరమే టెండర్లు పిలిచి పనుల్ని ఆరంభించాలని నీటి పారుదల శాఖా మంత్రి హరీశ్ రావు శుక్రవారం ఓ ప్రకటనలతో అధికారులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment