నిఖిల్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు బండారి లక్ష్మారెడ్డి.. నిఖిల్‌రెడ్డి (ఫైల్)
కుషాయిగూడ: స్నేహితులతో విహారయాత్రకు వెళ్లి పాండిచ్చేరి బీచ్‌లో సోమవారం గల్లంతైన నగరవాసి నారెడ్డి నిఖిల్‌రెడ్డి మృతదేహాం బుధవారం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. మృతదేహాన్ని విల్లుపురం పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. నగరానికి నేడు అవకాశముందని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. కుషాయిగూడ శ్మశానవాటికలో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
విషాద ఛాయలు..
శోక సంద్రంలో మునిగిన నిఖిల్‌రెడ్డి కుటుంబ సభ్యులను టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు బండారి లక్ష్మారెడ్డి పరామర్శించారు. నిఖిల్ తల్లి రేణుకను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిఖిల్‌రెడ్డి మరణవార్త తెలియడంతో ఆయన స్వగృహం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment