సమావేశంలో మాట్లాడుతున్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్‌అర్బన్ : సీఎం కేసీఆర్ ఆరాచక పాలనకు చరమగీతం పాడాలని డీసీసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం మామడ మండలానికి చెందిన 500మంది యువకులు, మహిళలు కాంగ్రెస్‌లో చేరారు. వీరికి మహేశ్వర్‌రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలంటూ మోసం చేశారన్నారు. తన కుటుంబసభ్యుల్లో ఐదుగురికి పదవులు ఇచ్చుకున్నారని విమర్శించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాల పేరిట కమీషన్లకు తెరలేపారని, అందుకే ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులు కట్టాబెడుతున్నారని ఆరోపించారు. ఇంటింటికి తాగునీరు అందిస్తామని రోడ్లన్నీ నాశనం చేస్తున్నారన్నారు. రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని రూ.2లక్షల కోట్ల అప్పుల రాష్ట్రం మార్చారని మండిపడ్డారు.
భారీగా చేరికలు..
మామడ మండలానికి చెందిన పండరి సురేందర్, పవన్, ఆశన్న, నవీన్‌ల ఆధ్వర్యంలో 300మంది, కొత్త సాంగ్వి గ్రామానికి చెందిన గాంధీరెడ్డి ఆధ్వర్యంలో 100మంది, చందారం గ్రామానికి చెందిన 50మంది వినాయక్‌రెడ్డి ఆధ్వర్యంలో, గోండుగూడకు చెందిన 50 మంది కాంగ్రెస్‌లో చేరారు. మామడ మండల బ్లాక్ అధ్యక్షుడు బాపురెడ్డి, నిర్మల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తక్కల రమణారెడ్డి, కాంగ్రెస్ యువజన విభాగం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు సత్యంచంద్రకాంత్, నాయకులు నవీన్‌కుమార్, అశోక్, భాస్కర్, ఆశ న్న, సంతోష్‌కుమార్, పాషా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment