గల్ఫ్‌లో నిజామాబాద్‌ యువకుల బందీ | Nizamabad teenagers captive in the Gulf | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌లో నిజామాబాద్‌ యువకుల బందీ

Published Fri, May 26 2017 1:40 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

గల్ఫ్‌లో నిజామాబాద్‌ యువకుల బందీ - Sakshi

గల్ఫ్‌లో నిజామాబాద్‌ యువకుల బందీ

నరకయాతన నుంచి  కాపాడాలని ‘సాక్షి’కి ఫోన్‌
 
రాయికల్‌(జగిత్యాల): గల్ఫ్‌లో నిజామాబాద్‌ జిల్లా యువకులు బందీ అయ్యారు. తాము వద్దన్నా.. కంపెనీ యజ మాని బలవంతంగా పని చేయించు కుంటున్నాడని వారు ఆవేదన వ్యక్తంచేశారు. స్వదేశం వెళ్లేలా చర్యలు చేపట్టాలని గురు వారం ‘సాక్షి’కి ఫోన్‌ చేసి వేడుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌కు చెందిన టి.దిలీప్‌ (పాస్‌పోర్టు నంబర్‌ కే6875512), జె. చిరంజీవి (పాస్‌పోర్టు ఎల్‌8029286), బి.రాంమోహన్‌ (పాస్‌పోర్టు నంబరు ఎల్‌4365444) రెండేళ్ల క్రితం గల్ఫ్‌వెళ్లారు. యూఏఈలోని అబుదాబీలో ఇర్షాద్‌ పెస్ట్‌ కంట్రోల్‌ కంపెనీలో పనికి కుదిరారు. ఇటీవల కంపెనీ సూపర్‌వైజర్‌ తన్వీర్‌ కాంట్రాక్ట్‌ అయిపోయిందని... ఇంటికి పంపిస్తామని మాయమాటలు చెప్పి వీసా రెన్యువల్‌ కాగి తాలపై సంతకాలు చేయించుకున్నాడు.

ఆ కాగితాలను అక్కడి ప్రభుత్వ అనుమతికి పంపించాడు. ఇలా రెండు నెలలు గడిచి పోయాయి. అప్పటి నుంచి కార్మికులు ‘మేం స్వదేశం వెళ్తాం.. పంపించండి ప్లీజ్‌’ అంటూ ఆ సూపర్‌వైజర్‌ను వేడుకున్నారు. ఇదేమీ పట్టించుకోని సూపర్‌ వైజర్‌ అబద్ధాలు చెబుతూ పేపర్లు వస్తాయి. ఆగండి.. అంటూ రెండు నెలలుగా పని చేయించుకున్నాడు.  దీంతో వారు ‘తమను స్వదేశం పంపడం కోసం అనుమతి పత్రాలపై సంతకాలని చెప్పి.. వీసా గడువు పొడిగింపుపై సంతకాలు చేయించుకున్నాడు’ అంటూ యూఏఈలోని లేబర్‌ కోర్టును ఆశ్రయించారు. నెలలు గడు స్తున్నా.. ఇంతవరకు కోర్టులో హియరింగ్‌కు రాకపోవడంతో ఆందోళనకు గురవుతు న్నారు. ఈ క్రమంలో తెలంగాణ అసోసియే షన్‌ ప్రతినిధి బసంత్‌ రెడ్డి, యూఏఈలోని తెలంగాణ అసోసియేషన్‌ ప్రతినిధులు రాజ శ్రీనివాస్‌ రావు, పృథ్వీరాజ్‌కు ఈ విషయం వివరించారు.

స్పందించిన వారు అబుదాబీ లోని భారత రాయబార కార్యాలయ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై కంపెనీ యాజమా న్యంతో రాయబార కార్యాలయ అధికారులు చర్చించారు. అయితే అప్పటికే కార్మికుల కాంట్రాక్ట్‌ రెన్యువల్‌ కావడంతో యూఏఈకి చెందిన 5,100 ధరమ్స్‌ (90 వేలు) సూపర్‌వైజర్‌కు చెల్లించా లని.. లేదంటే దేశం విడిచి వెళ్లరాదని ఆదే శాలు జారీచేశారు. వీసా రెన్యువల్‌ సంద ర్భంగా రెండు నెలలపాటు ముగ్గురు కార్మి కులు అక్రమంగా దేశంలో ఉన్నందున అబు దాబి ప్రభుత్వానికి చెల్లించాల్సిన జరిమానా కంపెనీ యాజ మాన్యం భరించాలని పేర్కొంది. అయితే, మేము ఇక్కడ ఉండలేమంటున్నా మాయ మాటలు చెప్పి వీసా రెన్యువల్‌ చేయించడం.. పోతామంటే 5,100 ధరమ్స్‌ (రూ.90 వేలు) చెల్లించాలనడం దారుణమని సూపర్‌వైజర్‌ చేతిలో మోసపోయిన కార్మి కులు లబోదిబో మంటున్నారు. మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత స్పందించి తమకు విముక్తి కల్పించాలని, స్వదేశానికి రప్పించాలని వారు వేడు కుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement