గంత జాగెక్కడున్నది..? | no space for new power plants | Sakshi
Sakshi News home page

గంత జాగెక్కడున్నది..?

Published Mon, Sep 8 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

గంత జాగెక్కడున్నది..?

గంత జాగెక్కడున్నది..?

గోదావరిఖని(కరీంనగర్) : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను ఎన్టీపీసీ సహకారంతో రామగుండం ప్రాంతంలో నెలకొల్పేందుకు సిద్దంగా ఉండగా... ఇం దుకు అవసరమైన భూమిని సింగరేణి నుంచి ఇప్పిస్తా మని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్లాంట్ల ఏర్పాటుకు సుమారు 4,500 ఎకరాల స్థలం అవసరం కానుం డ డంతో అంత భూమి ప్రస్తుతం సింగరేణి వద్ద అందు బాటులో లేదు.

దీంతో ఈ ప్లాంట్లకు సింగరేణి నుంచి భూ కేటాయింపులు ఎలా చేస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇందుకు 4 వేల మెగావాట్ల విద్యుత్ అవ సరం పడుతుందని ప్రభుత్వం భావించింది. ఇందుకను గుణంగా ఎన్టీపీసీ సహకారంతో రామగుండంలో విద్యు త్ ప్లాంట్లను నెలకొల్పేందుకు సిద్ధమైంది. ఇదే సమ యంలో స్థలం కేటాయిస్తే 800 మెగావాట్ల మొదటి ప్లాంట్‌ను 39 నెలల్లో పూర్తి చేసి ఇస్తామని ఎన్టీపీసీ సీఎండీ అరూప్‌రాయ్ చౌదరి కూడా ముఖ్యమంత్రి కేసీ ఆర్‌కు హామీ ఇచ్చారు.
 
దీంతో ప్లాంట్‌కు అవసరమైన భూమిని సింగరేణి నుంచి ఇప్పిస్తామని సీఎం ఎన్టీపీసీ వర్గాలకు హామీ ఇచ్చారు. కానీ ప్లాంట్ ఏర్పాటు కోసం అవసరమైన భూమి సింగరేణి వద్ద ప్రస్తుతం అందుబాటులో లేదు. సింగ రేణికి చెందిన మొత్తం 22వేల ఎకరాలలో భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల తో పాటు నివాస ప్రాంతాలున్నాయి.  ఖాళీ స్థలాలుంటే అతితక్కువ మొత్తంలో మాత్రమే ఉం డడంతో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం ప్రభు త్వం అన్వేషణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సింగ రేణి భూగర్భ గనుల పైభాగంలో ఉన్న స్థలాన్ని కేటా యించిన పక్షంలో భవిష్యత్‌లో భూగర్భం లో ఏర్పడ్డ కందకాల మూలంగా తీరని నష్టం జరిగే అవకాశాలు కలుగుతాయని ఆ వైపు అధికారులు ఆలో చించడం లేదు.
 
ఇక ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు వెలి కితీసిన తర్వాత అందు లో మట్టిని నింపి ఉపయో గించాలంటే ఆ భూమి లో గట్టితనం ఉండదు. దీంతో అక్కడ కూడా ప్లాంట్ల ఏర్పాటు అంత మంచిది కాద నే అభిప్రాయా నికి అధికారులు వచ్చి నట్లు సమాచారం. సింగరేణి సంస్థ గతంలో కమా న్‌పూర్ మండలం జూలపల్లి వద్ద 135 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు 135 ఎకరాల స్థలాన్ని సేకరించింది. ప్రస్తుతం కంపెనీ వద్ద రామ గుండం ప్రాంతంలో ఖాళీగా ఈ భూమి తప్ప మరెక్కడ స్థలం లేదు. దీంతో ప్రభుత్వం ఎన్టీపీసీ లేదా బీపీఎల్‌కు కేటాయించిన భూములను కొత్త విద్యుత్ ప్లాంట్ల కోసం ఆయా శాఖలను అడిగేందుకు సిద్ధమ వుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీపీసీ ప్లాంట్‌లో 800 మెగావాట్ల రెండు యూనిట్లను నెలకొల్పేందుకు అవసరమైన స్థలం ప్రస్తు తం అందుబాటులో ఉంది.
 
అలాగే ఎన్టీపీసీకి బొగ్గును సరఫరా చేసేందుకు నిర్మించిన ఎంజీఆర్ (మెరిగో రౌండ్) రైల్వే లైన్‌లో మార్పులు చేస్తే ఎన్టీపీ సీకి, లక్ష్మిపురం, ఎల్కల పల్లి గేట్ మధ్య స్థలంలో కూడా మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఒకవేళ ఇక్కడ ప్లాంట్లను నెలకొల్పితే వెలువడే బూ డిదను సింగరేణి గనులకు పంపించి మిగిలిన బూడి దను 2020లో మూసివేయ నున్న సింగరేణి మేడిపల్లి ఓసీపీ కందకాలలో నింపే ఆస్కారం కలుగుతుంది. ఇందుకు సింగరేణి కూడా అంగీకరించేందుకు సిద్ధంగా ఉంది. అలాగే బ్రిటీష్ ఫిజి కల్ ల్యాబొరేటరీ (బీపీఎల్)కు కేటాయించిన భూము ల్లో ఆ సంస్థ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్ప లేకపోవ డంతో ఆ స్థలాల్లో కూడా ప్రభుత్వం కొత్తగా యూని ట్లను నెలకొల్పడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో   ప్రభుత్వం ఎన్టీపీసీ లేదా బీపీఎల్ స్థలాలను కోరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement