
సాక్షి, హైదరాబాద్ : ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు ఇకపై డీజీపీ కార్యాలయం నుంచి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రయాణించే వారు మాత్రం తమ పేర్లను అక్కడి ప్రభుత్వాల యాప్‌లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు అంతరాష్ట్ర ప్రయాణాలకు డీజీపీ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా పాసులు జారీ చేసేది. (ప్రధాని మోదీకి కేసీఆర్ ఘాటు లేఖ)
కాగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం అంతర రాష్ట్ర ప్రయాణాలకు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణాలకు ట్రాన్స్ పోర్ట్ పాసులను జారీ చేయడాన్ని పోలీసు శాఖ నిలిపి వేసింది. తెలంగాణకు వచ్చే వాహనాలకు కూడా వాహన పాసులను అడగడం లేదు. అయితే ఆంద్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన వారు స్పందన యాప్‌లో, కర్ణాటకకు వెళ్లేవారు ఆ రాష్ట్రానికి చెందిన సేవా యాప్‌లోనూ, మహారాష్ట్రకు వెళ్లేవారు ఆ రాష్ట్ర పోర్టల్‌లో ప్రయాణికుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. (సెల్‌లో ఫొటోలు తీసి... ఆపై గర్భవతిని చేసి)
Comments
Please login to add a commentAdd a comment