'కేసీఆర్ భాషతో తెలంగాణకు ఒరిగేదేం లేదు' | no use with kcr's foul language, says kishan reddy | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ భాషతో తెలంగాణకు ఒరిగేదేం లేదు'

Published Tue, Nov 4 2014 6:21 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

'కేసీఆర్ భాషతో తెలంగాణకు ఒరిగేదేం లేదు' - Sakshi

'కేసీఆర్ భాషతో తెలంగాణకు ఒరిగేదేం లేదు'

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపయోగిస్తున్న భాషతో తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండబోదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి రజనీరెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మీద టీఆర్ఎస్ చేసిన విమర్శలన్నీ అవాస్తవాలని తేలిపోయిందని, తెలంగాణలో విద్యుత్ కోతలను నివారించేందుకు మహారాష్ట్రతో మాట్లాడతామని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రెచ్చగొట్టేలా మాట్లాడినంత మాత్రాన ఈ ప్రాంత ప్రజలకు ఏమీ ఒరగదని కిషన్ రెడ్డి చెప్పారు. రేషన్ కార్డులు, పింఛన్ల విషయంలో కోతలకు టార్గెట్ పెట్టడంపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రజనీరెడ్డి బీజేపీలో చేరారు. నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపర్చడానికే తాను బీజేపీలో చేరినట్లు రజనీరెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement