సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. సోమవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. జహీరాబాద్, కోహీర్ జెడ్పీటీసీ స్థానాలకు మూడు నామినేషన్లు దాఖలు కాగా, 18 మండలాల్లో ఎంపీటీసీ స్థానాలకు 31 నామినేషన్లు దాఖలయ్యాయి. కోహీర్ జెడ్పీటీసీ స్థానానికి కవేలి గ్రామానికి చెందిన ఫర్జానా బేగం టీఆర్‌ఎస్ నుంచి నామినేషన్ వేయగా, కూతురు సయ్యద్ రుక్సానా బేగం సైతం అదే పార్టీ నుంచి నామినేషన్ వేశారు. టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మొయిజుద్దీన్.. తన భార్య ఫర్జానా బేగం, కూతురు రుక్సానాబేగంతో కలిసి సంగారెడ్డిలోని జెడ్పీ కార్యాలయానికి వచ్చి నామినేషన్లు వేయించారు. ఝరాసంగం జెడ్పీటీసీ స్థానానికి జహీరాబాద్ మాజీ ఎంపీపీ, టీఆర్‌ఎస్ నాయకుడు దాసరి లక్ష్మారెడ్డి రెండు సెట్ల నామినేషన్ వేశారు.
తొలిరోజు జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా మిగతా 44 స్థానాలకు ఎవ్వరూ నామినేషన్లు దాఖలు చేయలేదు.
ఎంపీటీసీ స్థానాలకు 31 నామినేషన్లు
జిల్లాలో 685 ఎంపీటీసీ స్థానాలు ఉండగా తొలిరోజు 18 మండలాల్లో 31 నామినేషన్లు దాఖలయ్యాయి. 28 మండలాల్లో బోణీ కాలేదు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఒక్క ఎంపీటీసీ స్థానానికి కూడా నామినేషన్ దాఖలు కాలేదు. తొలిరోజు అత్యధికంగా చిన్నకోడూరు, రామాయంపేట మండల్లాలో నాలుగు చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.
జెడ్పీటీసీకి మూడు నామినేషన్లు
Published Tue, Mar 18 2014 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM
Advertisement
Advertisement