అన్నా.. పోగొట్టుకున్నచోటే వెతుక్కుంటా! | Nomula Narasimhaiah meets Jana reddy | Sakshi
Sakshi News home page

అన్నా.. పోగొట్టుకున్నచోటే వెతుక్కుంటా!

Published Wed, Jun 11 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM

అన్నా.. పోగొట్టుకున్నచోటే వెతుక్కుంటా!

అన్నా.. పోగొట్టుకున్నచోటే వెతుక్కుంటా!

సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఎన్నికల్లో జానారెడ్డిపై పోటీ చేసి ఓటమిపాలైన మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మంగళవారం అసెంబ్లీ వద్ద కొచ్చారు. ఈ సందర్భంగా జానారెడ్డి ఎదురవడంతో వారి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘‘అన్నా.. పోయినచోటే వెతుక్కుందామని వచ్చాను. వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ సాగర్ నుంచే పోటీ చేస్తా’’ అని నోముల జానాతో అన్నారు. అందుకు జానారెడ్డి ‘‘నువ్వు అక్కడ పోగొట్టుకున్నదేముంది.. వెతుక్కోవడానికి? మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్సీగానో, రాజ్యసభ సభ్యుడిగానో వెళ్లొచ్చు కదా!’’ అని సూచించారు. దీంతో నోముల ‘‘లేదన్నా.. ఎక్కడికి వెళ్లాలనే ఉద్దేశం లేదు. ఒకవేళ మీరేమైనా టీఆర్‌ఎస్‌కు దగ్గరైతే.. నేను వేరేది చూసుకుంటా’’అని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement