
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో పోటీ చేసే అభ్య ర్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. దేశ స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా 1952లో 489 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగగా, 1,874 మంది అభ్యర్థులు పోటీపడ్డా రు. ఈ సంఖ్య పెరుగుతూ 10 వేలకు చేరుకుం ది. 1996లో 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగగా, రికార్డు స్థాయిలో 13,952 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. 2009లో 8,070 మంది, 2014లో 8,251 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇప్పటి వరకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల వివరాలు ఇలా...
►1980లో అసోంలోని 12 లోక్ సభ స్థానాలకూ, మేఘాలయాలోని ఒక స్థానానికీ ఎన్నికలు జరగలేదు.
►1984లో 8వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో అసోంలోని 14 స్థానాలకు, పంజాబ్‌లోని 13 లోక్ సభ స్థానాలకూ ఎన్నికలు 1985లో జరిగాయి.
►1989లో 9వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో అసోంలోని 14 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగలేదు.
Comments
Please login to add a commentAdd a comment