సాక్షి, హైదరాబాద్: బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ నాంపల్లిలోని మహిళా కోర్టు న్యాయమూర్తి వై.సోమేశ్వరరావు సోమవారం తీర్పునిచ్చారు. తిరుమలగిరికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక స్థానికంగా ఉన్న పాఠశాలలో రెండో తరగతి చదివేది. 2012 ఏప్రిల్ 17న ఇంటి సమీపంలో ఉన్న దుకాణం వద్దకు వెళ్లగా అక్కడకు వచ్చిన విక్కీ మీ సమీప బంధువునే అంటూ బాలికతో మాటలు కలిపాడు.
ఇంటికి తీసుకువెళతానంటూ మాయమాటలు చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. అతడి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితుడిని అరెస్టు చేయడం తో పాటు దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేశా రు. ప్రాసిక్యూషన్ తరఫున వాదించిన అదనపు పీపీ పద్మలతారెడ్డి వాదనలతో ఏకీభవిం చిన న్యాయస్థానం విక్కీకి జీవితఖైదుతో పాటు రూ.1500 జరిమానా విధించింది.
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి జీవితఖైదు
Published Tue, Jun 10 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM
Advertisement
Advertisement