‘లోపం’ ఎక్కడ? | officers neglect on nutrition scheme | Sakshi
Sakshi News home page

‘లోపం’ ఎక్కడ?

Published Fri, Jul 25 2014 3:42 AM | Last Updated on Thu, Jul 11 2019 5:40 PM

officers neglect on nutrition scheme

ఇందూరు: చిన్న పిల్లల మరణాలను తగ్గించడంలో భాగంగా, తక్కువ, అతి తక్కువ బరువుతో పుట్టిన పిల్లల బరువును పెంచ డానికి కేంద్ర ప్రభుత్వం జూన్ 15 నుంచి ఐసీడీఎస్ ద్వారా అమలు చేస్తున్న ‘మినీ మెనూ’ (పౌష్టికాహార పథకం) ప్రారంభంలోనే బాలరిష్టాలను ఎదుర్కొంటోం ది. పథకం మొదలై నెల రోజులు గడుస్తు న్నా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడంలేదు. లోప పోషణకు గురైన పిల్లల కు అందించే పౌష్టికాహారం పాలు, గుడ్లు అంగన్‌వాడీ కేంద్రాలకు 15 రోజులుగా సరఫరా కావడం లేదు.

కొన్ని కేంద్రాలకు సరఫరా అయినప్పటికీ, పాత మెనూ ప్రకారమే అందిస్తున్నారు. మరి కొన్ని కేంద్రాల నిర్వాహకులు డెయిరీ నుంచి పాలు కొనుగోలు చేసి అం దిస్తున్నారు. దీంతో లోప పోషణకు గురైన పిల్లలకు పూర్తి స్థాయిలో అదనపు పౌష్టికాహారం అందడంలేదు.

 ఇదీ పరిస్థితి
 జిల్లాలో మొత్తం 10 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరి ధిలో 2,410 మెయిన్, 298 మినీ మొత్తం కలిపి 2,708 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో తక్కువ, అతి తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు, పోషణలోపానికి గురైన ప్లిలలు ఎంత మంది ఉన్నారో గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నెలల క్రితం ఐసీడీఎస్ అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ మేర కు ఐసీడీఎస్ పీడీ రాములు పిల్లల వివరాలు సేకరించాలని, అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్న అందరు పిల్లల బరువు తీయాలని సీడీ పీఓలు, సూపర్‌వైజర్‌లను ఆదేశించారు. ఇలా గుర్తించిన పిల్లలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మినీ మెనూ పథకం ద్వారా ప్రత్యేక అదనపు పౌష్టికాహారం అందజే యాల్సి ఉంటుంద ని వివరించారు. అందుకోసం వారికి ప్రత్యేక శిక్షణను కూడా ఇచ్చారు.

 మరేం జరుగుతోంది!
 ఈ పథకం అమలుకు సరిపడా ప్రత్యేక పౌష్టికాహారం అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా కావ డం లేదు. సరఫరా అయిన కేంద్రాలలో అమలుకు నోచుకోవడం లేదు. సిబ్బంది, అధికారు ల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. గతంలో పాల ను ఏజేన్సీల ద్వారా అంగన్‌వాడీలకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం అది నిలిచిపోయింది. అం గన్‌వాడీ కార్యకర్తలే నేరుగా పాలు కొనుగోలు చేసి పిల్లలకు అందజేయాలని, బిల్లులు సమర్పిస్తే డబ్బులు చెల్లిస్తామని పీడీ రాములు సూ చించారు.

 గ్రామీణ ప్రాంతాలలో పాల ధర లీటరుకు రూ.40 ఉండగా, పట్టణ ప్రాంతాలలో రూ. 50 ఉంది. దీంతో కార్యకర్తలు రోజూ డబ్బులు వెచ్చించి పాలు కొనుగోలు చేయలేకపోతున్నారు. కొన్ని ప్రాంతాలలో డెయిరీలు లేకపోవడంతో పాలు లేకుండానే పథకాన్ని అ మలు చేస్తున్నారు. ఇటు గుడ్ల ధర నాలుగైదు రూపాయల వరకు పెరగడంతో, తాము సరఫరా చేయలేమని ఏజేన్సీలు చేతులెత్తేశాయి. దీంతో పిల్లలకు రోజూ అందించాల్సిన గుడ్డును రెండు, మూడు రోజులకు ఒకసారి అందిస్తున్నట్లు తెలిసింది.

 పిల్లలు ఎంత మందో లెక్క లేదు
 గతంలో జిల్లాలో లోప పోషణకు గురైన పిల్లల ను గుర్తించారు. మినీ మెనూ పథకం అమలు జరుగుతుండడంతో మరోసారి క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించారు. దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది పిల్లలు లోప పోషణకు గురయ్యారని గుర్తించినట్లు సమాచారం. ఎందరు పిల్లలున్నారు? పౌష్టికాహారం ఎందరికి అందుతోంది. ఎంత  పౌష్టికాహారం వినియోగిస్తున్నారు.? అనే వివరాలను మాత్రం ఐసీడీఎస్ అధికారులు అధికారికంగా రాబట్టలేకపోతున్నారు. సీడీపీఓలను ప్రతి రోజూ అడుగుతు న్నా, వారు అధికారులు మాటలను లెక్కచేయ డం లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement