Nutrition scheme
-
ఇదీ పౌష్టికాహార మెనూ..
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాల్లోని దాదాపు 30.16 లక్షల మంది చెల్లెమ్మలు (గర్భిణులు, బాలింతలు), చిన్న పిల్లలకు ఏటా రూ.1863.11 కోట్ల వ్యయంతో చేపట్టిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల మోనూ గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ► గర్భిణులు, బాలింతలకు రోజూ మధ్యాహ్నం పెట్టే ఆహారంలో అన్నం, పప్పు, ఆకు కూర, కూరగాయలతో సాంబారు, కోడి గుడ్డు, 200 మి.లీ పాలు. ► నెలకు ఒక కేజీ రాగి పిండి, ఒక కేజీ సజ్జ/జొన్న పిండి, ఒక కేజీ అటుకులు, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల వేరుశనగ చిక్కీ, 250 గ్రాముల ఎండు ఖర్జూరం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ► గర్భిణులు, బాలింతలకు రోజూ మధ్యాహ్నం పెట్టే ఆహారంలో అన్నం, పప్పు, ఆకు కూర, కూరగాయలతో సాంబారు, కోడి గుడ్డు, 200 మి.లీ పాలు. ► బెల్లం 500 గ్రాములు, మల్టీ గ్రెయిన్ ఆటా 2 కేజీలు, ఎండు ఖర్జూరం, సజ్జ/ జొన్న పిండి.. 500 గ్రాములు ఇస్తారు. ► 6 నెలల నుంచి 36 నెలల వయసున్న పిల్లల కోసం సంపూర్ణ పోషణ కింద 2.5 కేజీల బాలామృతం, 25 కోడి గుడ్లు, 2.5 లీటర్ల పాలు. గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ పోషణ ప్లస్ కింద 2.5 కేజీల బాలామృతం, 30 కోడిగుడ్లు, 6 లీటర్ల పాలు ఇస్తారు. ► 3 ఏళ్ల నుంచి ఆరేళ్ల వరకు ఉన్న పిల్లలకు సంపూర్ణ పోషణలో 20 గ్రాములు ఉడికించిన శనగలు, రోజూ కోడిగుడ్డు, 100 మి.లీ పాలు. సంపూర్ణ పోషణ ప్లస్ పథకంలో బాలామృతంతో చేసిన లడ్డు/ కేకు 50 గ్రాములు, ప్రతి రోజూ కోడి గుడ్డు, 200 మి.లీ పాలు ఇస్తారు. ప్రతి రోజూ అన్నము, పప్పు, ఆకుకూర, కూరగాయలతో చేసి సాంబారుతో మధ్యాహ్న భోజనం. రక్తహీనత తగ్గిపోయింది అంగన్వాడీలో నేను పేరు నమోదు చేసుకున్న వెంటనే నాకు అన్నీ ఇచ్చారు. నెలకు సరిపడా పోషకాహారం ఇంటికే పంపారు. పాప కూడా బరువు పెరిగింది. రక్తహీనత తగ్గిపోయింది. మీరు పెట్టిన పథకాలు మా గ్రామంలో అర్హులందరికీ అందుతున్నాయి. అమ్మ ఒడి పథకం వల్ల అందరూ సంతోషంగా ఉన్నారు. మీ వల్ల మా పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటారు. మీకు ధన్యవాదాలు. – శివమ్మ బాయి, సుగాలి తండా, ఆత్మకూరు మండలం, కర్నూలు జిల్లా ఎన్నో పథకాలు అందుతున్నాయి నాకు సంపూర్ణ పోషణ ప్లస్ కింద అన్నీ అందడంతో డెలివరీ బాగా జరిగింది. రక్తహీనత సమస్య లేదు. మా లాంటి గిరిజనులకు ఎన్నో పథకాలు అందుతున్నాయి. మా గిరిజనులందరి తరఫున మీకు ధన్యవాదాలు. గతంలో అధికారులు చుట్టూ తిరిగినా పనులు జరిగేవి కావు. ఇప్పుడు గ్రామ సచివాలయం ద్వారా ఏ పని అయినా వెంటనే అవుతుంది. మళ్లీ మళ్లీ మీరే మా ముఖ్యమంత్రిగా రావాలి. – పల్లాల కరుణమ్మ, రంపచోడవరం, తూర్పుగోదావరి జిల్లా ఆరోగ్యంగా తల్లీ బిడ్డలు నాకు మూడేళ్ల బాబు ఉన్నాడు. సంపూర్ణ పోషణ బాబుకు చాలా ఉపయోగపడింది. చురుగ్గా ఉంటున్నాడు. మా గిరిజన ప్రాంతాల్లో మీరు ఇచ్చిన సంపూర్ణ పోషణ వల్ల గర్భిణులు, తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటున్నారు. మంచి ఆహారం అందుతోంది. గొప్ప గొప్ప వారి పిల్లల్లా మా పిల్లలు కూడా ఇంగ్లిష్లో మాట్లాడుతారన్న నమ్మకం వచ్చింది. అంగన్వాడీ స్కూళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చడం ఎంతో మేలు. – శ్రీనాధమణి, గుడివాడ, పాడేరు మండలం, విశాఖపట్నం జిల్లా -
వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలకు నీతి ఆయోగ్ ప్రశంస
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం కొత్తగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఈ పథకాలతో గర్భిణులు, చిన్న పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం, తగిన పౌష్టికాహారం అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి ముఖ్యమైన అడుగు వేసిందని సోమవారం ట్వీట్ చేసింది. -
సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
ఆరోగ్యమే మహాభాగ్యం
-
గుడ్డు జారి గల్లంతయ్యిందే...
సాక్షి, బేస్తవారిపేట(ప్రకాశం): పేద విద్యార్థులు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. పిల్లల ఆరోగ్యానికి వారానికి ఐదు కోడి గుడ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా.. ఆచరణలో అసంపూర్తిగానే అమలు చేస్తోంది. ఏజెన్సీలకు బిల్లులను సకాలంలో చెల్లించకపోవడం, ఏజెన్సీల గడువు ముగిసిన పట్టించుకోకపోవడంతో గుడ్డు సరఫరా నిలిచిపోయింది. ఫిబ్రవరి నుంచి పత్తా లేని గుడ్డు.. ప్రచార ఆర్భాటానికి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పౌష్టికాహారం దగ్గరకొచ్చేసరికి గుడ్లు తేలేస్తోంది. ఫిబ్రవరి నెల నుంచి మధ్యాహ్నా భోజన పథకంలో గుడ్డుకు ఎగనామం పెడుతోంది. అంగన్వాడీల్లోనూ అందని గుడ్డు.. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నా భోజన పథకం అమల్లో ఉంది. పాఠశాల్లో సుమారు 2.60 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. అదేవిధంగా ఐసీడీయస్ ప్రాజెక్టు పరిధిలో జిల్లాలో మొత్తం 21 ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో 180 సెక్టార్లు గా విభజించారు. మొత్తం 4244 కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 4009 మెయిన్ సెంటర్లు, 225 మినీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 85 వేల మంది చిన్నారులు ఉన్నారు. వీరు కాక 13568 మంది గర్భిణిలు, 9826 మంది గర్భిణులు ఉన్నారు. వీరందరికి నెల రోజులుగా గుడ్లు అందని పరిస్థితి నెలకొంది. బిల్లుల చెల్లింపులకు ‘ఎగ్’నామం ఒక్క శనివారం మినహా మిగితా ఐదు రోజులు కోడిగుడ్డు అందించాల్సి ఉంది. గుడ్డును పాఠశాలకు సరఫరా చేసే ఏజెన్సీల గడువు ముగియడంతో ప్రభుత్వం గత ఏజెన్సీకే టెండర్ను పొడిగించింది. కానీ గడువు పూర్తి అయిన తర్వాత పెంచడంతో మళ్లీ గుడ్లు కొనుగోలు చేసి సరఫరా చేయడంలో కొంత సమయం పట్టింది. దీంతో రెండు వారాలకుపైగానే గుడ్ల సరఫరా నిలిచిపోయింది. బిల్లులు కూడా ప్రభుత్వం సక్రమంగా చెల్లించకపోవడంతో మరింత అలసత్వం నెలకొంది. మధ్యాహ్నా భోజన ఏజెన్సీలు గుడ్డును కొనుగోలు చేసి పెట్టేందుకు భారంగా మారడంతో ఒప్పుకోలేదు. ప్రస్తుతం పెంచిన గడువు ముగియడంతో పూర్తిగా గుడ్ల సరఫరా లేక విద్యార్థులకు పౌష్టికాహారం అందని ద్రాక్షగానే మారింది. కోర్టులు ఆదేశించినా... మధ్యాహ్న భోజన పథకం అమలు సక్రమంగా లేదని తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ వేయడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉలవపాడు మండలం రామాయపట్నంలోని పాఠశాలలను ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, కలెక్టర్ తోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు తనిఖీలు జరిపారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించాలని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వమే నిర్లక్ష్యంగా ఉంటే ప్రధానోపాధ్యాయులు మాత్రం ఏం చేయగలరు. ఓ వైపు కోర్టు అధికారులను, ప్రభుత్వాన్ని మందలిస్తున్నా ఉపయోగం లేకుండా పోయింది. పరీక్షల సమయంలో ఇబ్బందులు.. ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతుండగా, మార్చి–18 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో వీరంతా ఎక్కువ సమయం చదువుపై దృష్టి సారించడం సహజం. ఈ సమయంలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో పౌష్టికాహారం అవసరం. కానీ మధ్యాహ్నా భోజన పథకానికి చెల్లించే ధరలు తక్కువ కావడంతో చాలాచోట్ల నాసిరకమైన భోజనం అందిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు విద్యార్థులు భోజనాన్ని తినలేకపోతున్నారు. విద్యార్థులు ఆహారంలో గుడ్లు వేస్తారని కొంతమేర ఆసక్తి చూపిస్తారు. గుడ్లు లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. పరీక్షల సమయంలోనైనా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా రోజుల నుంచి గుడ్డు పెట్టడం లేదు.. గత నెల నుంచి మధ్యాహ్నా భోజనంలో గుడ్డు ఇవ్వడం లేదు. గుడ్డు గురించి అడిగితే పైనుంచి సరఫరా లేదని చెబుతున్నారు. దీంతో ఏజెన్సీ వారు పెట్టే కూర అన్నం మాత్రమే తింటున్నాం. పాఠశాలలకు గుడ్లను సరఫరా చేయాలి. –బ్రహ్మయ్య, 8వ తరగతి, జెడ్పీ ఉన్నత పాఠశాల, బేస్తవారిపేట ప్రభుత్వం గుడ్లు సరఫరా చేయాలి.. ప్రభుత్వం నెల రోజులుగా గుడ్ల సరఫరా నిలిచిపోయిన పట్టించుకోలేదు. పాఠశాలలకు గుడ్లను సరఫరా చేయాలి. గతంలో వారానికి రెండు రోజులు పంపిణీ చేసేటప్పుడు బాగా ఇచ్చారు. వారానికి ఐదు రోజులు పంపిణీ జరుగుతున్నప్పటి నుంచి సక్రమంగా లేకుండపోయింది. –సంజీవరాయుడు, 8వ తరగతి, జెడ్పీ ఉన్నత పాఠశాల, బేస్తవారిపేట -
‘లోపం’ ఎక్కడ?
ఇందూరు: చిన్న పిల్లల మరణాలను తగ్గించడంలో భాగంగా, తక్కువ, అతి తక్కువ బరువుతో పుట్టిన పిల్లల బరువును పెంచ డానికి కేంద్ర ప్రభుత్వం జూన్ 15 నుంచి ఐసీడీఎస్ ద్వారా అమలు చేస్తున్న ‘మినీ మెనూ’ (పౌష్టికాహార పథకం) ప్రారంభంలోనే బాలరిష్టాలను ఎదుర్కొంటోం ది. పథకం మొదలై నెల రోజులు గడుస్తు న్నా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడంలేదు. లోప పోషణకు గురైన పిల్లల కు అందించే పౌష్టికాహారం పాలు, గుడ్లు అంగన్వాడీ కేంద్రాలకు 15 రోజులుగా సరఫరా కావడం లేదు. కొన్ని కేంద్రాలకు సరఫరా అయినప్పటికీ, పాత మెనూ ప్రకారమే అందిస్తున్నారు. మరి కొన్ని కేంద్రాల నిర్వాహకులు డెయిరీ నుంచి పాలు కొనుగోలు చేసి అం దిస్తున్నారు. దీంతో లోప పోషణకు గురైన పిల్లలకు పూర్తి స్థాయిలో అదనపు పౌష్టికాహారం అందడంలేదు. ఇదీ పరిస్థితి జిల్లాలో మొత్తం 10 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరి ధిలో 2,410 మెయిన్, 298 మినీ మొత్తం కలిపి 2,708 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో తక్కువ, అతి తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు, పోషణలోపానికి గురైన ప్లిలలు ఎంత మంది ఉన్నారో గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నెలల క్రితం ఐసీడీఎస్ అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ మేర కు ఐసీడీఎస్ పీడీ రాములు పిల్లల వివరాలు సేకరించాలని, అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న అందరు పిల్లల బరువు తీయాలని సీడీ పీఓలు, సూపర్వైజర్లను ఆదేశించారు. ఇలా గుర్తించిన పిల్లలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మినీ మెనూ పథకం ద్వారా ప్రత్యేక అదనపు పౌష్టికాహారం అందజే యాల్సి ఉంటుంద ని వివరించారు. అందుకోసం వారికి ప్రత్యేక శిక్షణను కూడా ఇచ్చారు. మరేం జరుగుతోంది! ఈ పథకం అమలుకు సరిపడా ప్రత్యేక పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా కావ డం లేదు. సరఫరా అయిన కేంద్రాలలో అమలుకు నోచుకోవడం లేదు. సిబ్బంది, అధికారు ల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. గతంలో పాల ను ఏజేన్సీల ద్వారా అంగన్వాడీలకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం అది నిలిచిపోయింది. అం గన్వాడీ కార్యకర్తలే నేరుగా పాలు కొనుగోలు చేసి పిల్లలకు అందజేయాలని, బిల్లులు సమర్పిస్తే డబ్బులు చెల్లిస్తామని పీడీ రాములు సూ చించారు. గ్రామీణ ప్రాంతాలలో పాల ధర లీటరుకు రూ.40 ఉండగా, పట్టణ ప్రాంతాలలో రూ. 50 ఉంది. దీంతో కార్యకర్తలు రోజూ డబ్బులు వెచ్చించి పాలు కొనుగోలు చేయలేకపోతున్నారు. కొన్ని ప్రాంతాలలో డెయిరీలు లేకపోవడంతో పాలు లేకుండానే పథకాన్ని అ మలు చేస్తున్నారు. ఇటు గుడ్ల ధర నాలుగైదు రూపాయల వరకు పెరగడంతో, తాము సరఫరా చేయలేమని ఏజేన్సీలు చేతులెత్తేశాయి. దీంతో పిల్లలకు రోజూ అందించాల్సిన గుడ్డును రెండు, మూడు రోజులకు ఒకసారి అందిస్తున్నట్లు తెలిసింది. పిల్లలు ఎంత మందో లెక్క లేదు గతంలో జిల్లాలో లోప పోషణకు గురైన పిల్లల ను గుర్తించారు. మినీ మెనూ పథకం అమలు జరుగుతుండడంతో మరోసారి క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించారు. దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది పిల్లలు లోప పోషణకు గురయ్యారని గుర్తించినట్లు సమాచారం. ఎందరు పిల్లలున్నారు? పౌష్టికాహారం ఎందరికి అందుతోంది. ఎంత పౌష్టికాహారం వినియోగిస్తున్నారు.? అనే వివరాలను మాత్రం ఐసీడీఎస్ అధికారులు అధికారికంగా రాబట్టలేకపోతున్నారు. సీడీపీఓలను ప్రతి రోజూ అడుగుతు న్నా, వారు అధికారులు మాటలను లెక్కచేయ డం లేదు.