నిజామాబాద్ అర్బన్ : మెడికల్ కళాశాల సమస్యలను తీర్చేందుకు ఎట్టకేలకు ఉన్నతాధికారులు నడుం బిగించారు. వైద్య విధాన పరిషత్ నుంచి ఆసుపత్రిని స్వాధీనం చేసుకునేందుకు కసరత్తు పూర్తి చేశారు. శనివారం రెండవసారి జిల్లాకు వచ్చిన వైద్య శాఖ ఉన్నతాధికారులు మెడికల్ కళాశాలలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కళాశాలలో సిబ్బంది నియామకాల విషయా న్ని పరిశీలించారు. వైద్యా విధాన పరిషత్ నుంచి పలువురు ఉద్యోగులను ఆప్షన్ల ద్వారా మెడికల్ కళాశాలలో నియమించారు.
ఇందులో ఒక డిప్యూ టీ సివిల్ సర్జన్, ఆరుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 15 మంది కాంట్రా క్టు వైద్యులు, 34 మంది నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. పరిపాలనా విభాగంలో ఒకరు, పారామెడికల్‌లో 24 మంది, నాల్గవ తరగతి ఉద్యోగులు 51 మం ది మెడికల్ కళాశాలకు అప్షన్లు ఇచ్చారు. ఆప్షన్లు ఇవ్వని ఉద్యోగులను ఫా రిన్ సర్వీసు కింద కళాశాలలో కొనసాగేలా చర్యలు తీసుకోనున్నారు. అప్ష న్లు ఇచ్చిన ఉద్యోగులు కళాశాల పరిధిలోని ఎక్కడైన విధులు నిర్వహిం చేందుకు అవకాశం కల్పించారు. వీరిని మరో మూడు రోజులలో అధికారికంగా కళాశాల ఆధీనంలోకి తీసుకరానున్నామని డీఎంఈ తెలిపారు. ఆయన మూడు గంటలపాటు సుదీర్ఘంగా వైద్యాధికారులతో
సమీక్ష నిర్వహించారు.
వైద్యులకు బాధ్యతలు అప్పగింత
ఆసుపత్రిలోని కళాశాల వైద్యులకు వివిధ బాధ్యతలను అప్పజెప్పారు. డాక్టర్ భీంసింగ్‌ను అంధత్వ నివారణ సంస్థ ఇన్‌చార్జిగా, డాక్టర్ సత్యనారాయణను బ్లడ్‌బ్యాంకు ఇన్‌చార్జి గా, డాక్టర్ భానుప్రసాద్‌ను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, డాక్టర్ శ్రావణ్‌ను ఆర్‌ఎంఓగా నియమించారు. పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లను, సిబ్బందిని నియమించేం దుకు కసరత్తు చేస్తున్నామని డీఎంఈ వెల్లడించారు. ఈ సమావేశంలో కళశాల ప్రిన్సిపాల్ జిజియాబాయి, వైద్యావిధాన పరిషత్ కమిషన ర్ డాక్టర్ వీణాకుమారి, ఆసుపత్రి ఆర్‌ఎంఓలు డాక్టర్ విశాల్, బన్సీలాల్, రజనీకాంత్, డాక్టర్ భీంసింగ్, సూపరిం డెంట్ రాజేంద్రప్రసాద్, పరిపాలన అధికారి నరేందర్, డీసీహెచ్‌ఎస్ తదితరులు పాల్గొన్నారు.
శానిటేషన్ సిబ్బంది నిరసన
ఆగిపోయిన వేతనాలను చెల్లించాలంటూ శానిటేషన్ సిబ్బంది ఆందోళనకు దిగారు. డీఎంఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తుండగా కళాశాల ప్రవేశమార్గం వద్ద బైఠాయిం చారు. ఐదు నెలలుగా వేతనాలు లేవని, తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా డీఎంఈ మాట్లాడుతూ కలెక్టర్ రాగానే ఐదు నెలల వేతనాలను మంజూరు చేస్తామని, అవి తీసుకోవాలని సూచించారు. పెరిగిన వేతనాలకు ఆర్థిక శాఖ అనుమతి లేదని పేర్కొన్నారు.
ప్రక్షాళన షురూ
Published Sun, Sep 21 2014 1:45 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement