The transfer of employees
-
పనితీరే కొలమానం
మాఫియా ఆగడాలను అరికట్టండి బదిలీల్లో మంత్రుల జోక్యం ఉండదు సమావేశంలో మంత్రి దేవినేని మైనింగ్ శాఖ అధికారుల పనితీరుపై అసహనం విజయవాడ : ఉద్యోగులంతా రాజీపడకుండా పారదర్శకంగా పనిచేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హితవు పలికారు. ఉద్యోగుల బదిలీలకు పనితీరే కొలమానమని, ఉద్యోగుల బదిలీ వ్యవహరంలో మంత్రుల జోక్యం ఉండదని సృష్టం చేశారు. బుధవారం స్థానిక నీటి పారుదల శాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు, చేపట్టనున్న కార్యక్రమాలపై మంత్రులు సమావేశంలో చర్చించారు. శాఖల వారీగా అధికారులు ఆయా శాఖల గురించి సమావేశంలో వివరించగా మంత్రి దేవినేని పలు శాఖల అధికారుల తీరుపై ఆగ్రహం, అసహనం వక్తం చేశారు. మంత్రి దేవినేని మాట్లాడుతూ ఉద్యోగులు అవినీతికి దూరంగా పూర్తి పారదర్శకతతో పనిచేయాలని హితవు పలికారు. రాష్ట్ర రాజధాని ఇక్కడే నిర్మితం కానున్న నేపథ్యంలో వివిధ శాఖల ద్వారా చేపట్టాల్సిన పనులు, ఇతర కార్యక్రమాల వివరాలపై అధికారులు పూర్తిస్థాయిలో నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ పథకాలపై, ఇతర అభివృద్ధి పనులపై తప్పనిసరిగా సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లు అధికారులంతా అవినీతికి దూరంగా పనిచేయాలని ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమంలో అందిన 5.40 లక్షల దరఖాస్తులు పరిష్కరించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, దీనికోసం అధికారులంతా పూర్తిస్థాయిలో తమకు సహకరించాలని కోరారు. విద్యుత్ శాఖపై మాట్లాడుతూ సబ్-స్టేషన్ల నిర్మాణం, వీటీ పీఎస్ కొత్త విద్యుత్ లైన్‌కు అవసరమైన భూసేకరణ, ఇతర కార్యక్రమాలను రెవెన్యూ అధికారుల సమన్వయంతో పూర్తిచేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌పై మాట్లాడుతూ 970 పంచాయతీలకుగానూ 400 మంది అధికారులు మాత్రమే ఉన్నారని, జిల్లా కలెక్టర్‌తో సంప్రదించి పారదర్శకంగా వీఆర్వోల బదిలీలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లావైద్య ఆరోగ్య శాఖపై మాట్లాడుతూ జిల్లాలో 178 మెడికల్ ఆఫీసర్ పోస్ట్‌లకు గానూ 44 మంది మాత్రమే పనిచేస్తున్నారని చెప్పారు. ఖాళీలున్న 534 ఏఎన్ఎం పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై మాట్లాడుతూ గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో 9 స్థానం వచ్చిందని, వచ్చే సంవత్సరం మెదటి మూడు స్థానాల్లో ఉండడానికి విశేషంగా కృషిచేయాలని సూచించారు జిల్లా పౌరసరఫరాలశాఖ,మార్కెటింగ్శాఖపై మాట్లాడారు. రైతులకు సుబాబుల బకాయిలు ఎగ్గొట్టిన వారిపై పోలీసుల సహకారంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైనింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నగర పాలక సంస్థ, వీజీటీఎం ఉడా, ఇతర విభాగాలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దె అనూరాధ, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడారు. కలెక్టర్ రఘు నందన్‌రావు మాట్లాడుతూ ఈపాస్ విధానంతో ఆధార్‌ను అనుసంధానం చేసి ప్రభుత్వ పథ కాలను ప్రజలకందించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జేసీ మురళీ, విజయవాడ సీపీ ఏబీ వెంకటేశ్వరరావు , ఉడా వైస్ చైర్మన్ పి.ఉషాకుమారి, ఎస్పీ విజయ్‌కుమార్, సబ్‌కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లాముఖ్య ప్రణాళికాధికారి శర్మ, ఇరిగేషన చీఫ్ ఇంజినీర్ సుధాకర్, డ్వామా పీడీ మధులత, డీఎంహెచ్‌వో నాగ మల్లేశ్వరి, డీపీవో నాగరాజు వర్మ, వివిధ విభాగాల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. -
ఉన్నపళంగా తరలింపు తగదు
ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు మంత్రులు చెట్ల కింద పనిచేస్తే ఉద్యోగులూ సిద్ధం ఒత్తిడి వల్ల లాభం కంటే ఇబ్బందులే ఎక్కువ విజయవాడ బ్యూరో: తాత్కాలిక రాజధానికి ఉద్యోగుల బదిలీ ప్రక్రియ దశలవారీగా జరగాలే తప్పా ఇప్పటికిప్పుడే హైదరాబాద్ నుంచి తరలించే యత్నం సరికాదని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అన్నారు. తాత్కాలిక రాజధానికి తక్షణం వెళ్లిపోవాలంటే.. మంత్రులు, ఐఏఎస్‌లు చె ట్ల కింద కూర్చుని పనిచేస్తే తామూ పనిచేస్తామన్నారు. విజయవాడ ఏపీఎన్జీవో కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్న అనేక అంశాలను మంగళవారం సీఎం చంద్రబాబుతో జరిగే సమావేశంలో ప్రస్తావిస్తామని చెప్పారు. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. ఈలోగా తాత్కాలిక రాజధానిని నిర్మించుకుని, ప్రజలకు తక్షణ అవసరమైన శాఖలను దశలవారీగా తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.రాజధాని స్వరూప స్వభావాలు, పరిపాలనపై ప్రభుత్వం ఉద్యోగులతో చర్చించాలని డిమాండ్ చేశారు. హెల్త్‌కార్డులపై నేడు సీఎం సమావేశం.. ఉద్యోగులకు హెల్త్‌కార్డులు అందించే అంశాన్ని చర్చించేందుకు మంగళవారం సీఎం నిర్వహించే సమావేశంలో ఆ పథకం అమలులో లోపాలను చర్చించడంతో పాటు ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తెస్తామని అశోక్‌బాబు చెప్పారు -
ప్రక్షాళన షురూ
నిజామాబాద్ అర్బన్ : మెడికల్ కళాశాల సమస్యలను తీర్చేందుకు ఎట్టకేలకు ఉన్నతాధికారులు నడుం బిగించారు. వైద్య విధాన పరిషత్ నుంచి ఆసుపత్రిని స్వాధీనం చేసుకునేందుకు కసరత్తు పూర్తి చేశారు. శనివారం రెండవసారి జిల్లాకు వచ్చిన వైద్య శాఖ ఉన్నతాధికారులు మెడికల్ కళాశాలలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కళాశాలలో సిబ్బంది నియామకాల విషయా న్ని పరిశీలించారు. వైద్యా విధాన పరిషత్ నుంచి పలువురు ఉద్యోగులను ఆప్షన్ల ద్వారా మెడికల్ కళాశాలలో నియమించారు. ఇందులో ఒక డిప్యూ టీ సివిల్ సర్జన్, ఆరుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 15 మంది కాంట్రా క్టు వైద్యులు, 34 మంది నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. పరిపాలనా విభాగంలో ఒకరు, పారామెడికల్‌లో 24 మంది, నాల్గవ తరగతి ఉద్యోగులు 51 మం ది మెడికల్ కళాశాలకు అప్షన్లు ఇచ్చారు. ఆప్షన్లు ఇవ్వని ఉద్యోగులను ఫా రిన్ సర్వీసు కింద కళాశాలలో కొనసాగేలా చర్యలు తీసుకోనున్నారు. అప్ష న్లు ఇచ్చిన ఉద్యోగులు కళాశాల పరిధిలోని ఎక్కడైన విధులు నిర్వహిం చేందుకు అవకాశం కల్పించారు. వీరిని మరో మూడు రోజులలో అధికారికంగా కళాశాల ఆధీనంలోకి తీసుకరానున్నామని డీఎంఈ తెలిపారు. ఆయన మూడు గంటలపాటు సుదీర్ఘంగా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్యులకు బాధ్యతలు అప్పగింత ఆసుపత్రిలోని కళాశాల వైద్యులకు వివిధ బాధ్యతలను అప్పజెప్పారు. డాక్టర్ భీంసింగ్‌ను అంధత్వ నివారణ సంస్థ ఇన్చార్జిగా, డాక్టర్ సత్యనారాయణను బ్లడ్‌బ్యాంకు ఇన్చార్జి గా, డాక్టర్ భానుప్రసాద్‌ను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, డాక్టర్ శ్రావణ్‌ను ఆర్ఎంఓగా నియమించారు. పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లను, సిబ్బందిని నియమించేం దుకు కసరత్తు చేస్తున్నామని డీఎంఈ వెల్లడించారు. ఈ సమావేశంలో కళశాల ప్రిన్సిపాల్ జిజియాబాయి, వైద్యావిధాన పరిషత్ కమిషన ర్ డాక్టర్ వీణాకుమారి, ఆసుపత్రి ఆర్‌ఎంఓలు డాక్టర్ విశాల్, బన్సీలాల్, రజనీకాంత్, డాక్టర్ భీంసింగ్, సూపరిం డెంట్ రాజేంద్రప్రసాద్, పరిపాలన అధికారి నరేందర్, డీసీహెచ్ఎస్ తదితరులు పాల్గొన్నారు. శానిటేషన్ సిబ్బంది నిరసన ఆగిపోయిన వేతనాలను చెల్లించాలంటూ శానిటేషన్ సిబ్బంది ఆందోళనకు దిగారు. డీఎంఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తుండగా కళాశాల ప్రవేశమార్గం వద్ద బైఠాయిం చారు. ఐదు నెలలుగా వేతనాలు లేవని, తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా డీఎంఈ మాట్లాడుతూ కలెక్టర్ రాగానే ఐదు నెలల వేతనాలను మంజూరు చేస్తామని, అవి తీసుకోవాలని సూచించారు. పెరిగిన వేతనాలకు ఆర్థిక శాఖ అనుమతి లేదని పేర్కొన్నారు.