జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాలో పాతనోట్ల మార్పిడి ముఠా గుట్టురట్టయిం ది. పర్సంటేజీ తీసుకుని... రద్దయిన పాత నోట్లకు బదులు కొత్తనోట్లు సమకూరు స్తున్న నలుగురిని జగిత్యాల పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కారులో వరంగల్ నుంచి జగిత్యాలకు తీసుకొస్తున్న రూ. 25.50 లక్షల పాత నోట్లతోపాటు నలుగురిని జగిత్యాల మండలం ధరూర్ శివారులో పోలీసులు పట్టుకున్నారు. నోట్ల ముఠా వివరాలను జిల్లా ఎస్పీ అనంతశర్మ గురువారం విలేకరులకు వివరించారు. వరంగల్ జిల్లాకు చెందిన సల్మాన్ కొద్ది సంవత్సరాలు దుబాయ్‌లో పనిచేసి వచ్చి వరంగల్‌లో ఉంటున్నాడు.
ఇతని బంధువు నాసర్, హన్మకొండకు చెందిన అజీమ్‌ఖాన్, ఆర్మీ మాజీ ఉద్యోగి ఐత శ్రీనివాస్ కలసి పాత నోట్లను మార్పిడి చేయాలనుకున్నా రు. అందుకు ఐత శ్రీనివాస్ హైదరాబాద్‌కు చెందిన కాలిశెట్టి వేణుతో పాతనోట్లు మార్పిడి గురించి ఫోన్లో ఒప్పందం కుదు ర్చుకున్నాడు. పాతనోట్ల మార్పిడి గురించి ఫోన్‌లో మాట్లాడుతుండగా నవీన్ అనే వ్యక్తి విని వేణుతో పరిచయం పెంచుకున్నాడు. 33 శాతం పర్సంటేజీ తీసుకుని పాతనోట్లకు బదులు కొత్త నోట్లు ఇస్తానని సల్మాన్, నాసర్, అజీమ్ ఖాన్, మురళీ, శ్రీనివాస్ కాలిశెట్టి వేణుతో ఒప్పందం కుదుర్చుకు న్నాడు.
ఈ మేరకు పాతనోట్లతో జగిత్యాలకు రావాలని వేణు సూచించగా ఆ ఐదుగురు స్నేహితులు ఇండికా కారులో రూ. 25.50 లక్షలు తీసుకుని వరంగల్ నుంచి జగిత్యాలకు బయలుదేరారు. పాతనోట్ల మార్పిడి జరుగుతుందన్న పక్కా సమాచారం తెలుసుకున్న జగిత్యాల రూరల్ సీఐ శ్రీనివాస్ చౌదరి, ఎస్సై కిరణ్‌కుమార్ ధరూర్ శివారులో మకాం వేసి.. కారును ఆపి చెక్ చేశారు. కారులో ఉన్న డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో సల్మాన్ పారిపోగా.. వేణు, ఐత శ్రీనివాస్, నాజర్, అజీమ్‌ఖాన్ పోలీసులకు దొరికిపోయారు. వీరిపై రిజర్వ్ బ్యాంక్ కొత్త చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నామని ఎస్పీ చెప్పారు.
పాతనోట్ల ముఠా గుట్టురట్టు
Published Fri, May 5 2017 12:55 AM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM
Advertisement
Advertisement