Old notes exchange
-
పాతనోట్ల మార్పిడి... ఇరకాటంలో మాజీ ప్రజాప్రతినిధి
పెద్ద అంబర్‌పేట: పాతనోట్ల మార్పిడి వ్యవహారం ఓ మాజీ ప్రజాప్రతినిధిని ఇరకాటంలో పడేసింది. తాజాగా ఆదాయపు పన్ను శాఖ ఆ నేత అనుచరుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించడం జిల్లాలో కలకలం సృష్టించింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన ఈ మాజీ ప్రజాప్రతినిధి గతేడాది జరిగిన పెద్దనోట్ల రద్దు సమయంలో భారీ మొత్తంలో నగదు మార్పిడి చేశారని గుర్తించిన ఐటీ శాఖ గురు, శుక్రవారాల్లో ఆయన అనుచరులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం స్థానికంగా చర్చానీయాంశంగా మారింది. ఆ నేత బాటలో పయనించే సుమారు 40 మంది యువకులను టార్గెట్ చేసిన అధికారులు గురువారం వేకువ జామునుంచే ఒక్కొక్కరి ఇళ్లపై దాడులను మొదలుపెట్టి... అర్థరాత్రి వరకూ కొనసాగించినట్లు తెలిసింది. ఈ వార్త ప్రసార మాధ్యమాల్లో ప్రసారం కావడంతో సర్వత్రా ఇదే చర్చ కొనసాగింది. నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు ఆయన అనుచరుల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటిలో ఒక్కొక్కరికీ రూ.20 లక్షల నుంచి రూ.కోటికి పైగా జమ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఐటీ దాడులు చేసిన మాజీ ప్రజాప్రతినిధి అనుచరులంతా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారితో పాటు చిరు ఉద్యోగాలు, కూలి పనిచేస్తున్నవారే కావడం విశేషం. ఈ దాడుల అనంతరం యువకులంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. కాగా, ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధంలేదని, సదరు నాయకుడు ఆధార్, పాన్‌కార్డులు ఇవ్వమంటే ఇచ్చామని, అనవసరంగా ఇరికించారని అనుమానిత యువకులు సన్నిహితులు, ఐటీ అధికారుల వద్ద వాపోయినట్లు తెలిసింది. -
పాతనోట్ల ముఠా గుట్టురట్టు
జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాలో పాతనోట్ల మార్పిడి ముఠా గుట్టురట్టయిం ది. పర్సంటేజీ తీసుకుని... రద్దయిన పాత నోట్లకు బదులు కొత్తనోట్లు సమకూరు స్తున్న నలుగురిని జగిత్యాల పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కారులో వరంగల్ నుంచి జగిత్యాలకు తీసుకొస్తున్న రూ. 25.50 లక్షల పాత నోట్లతోపాటు నలుగురిని జగిత్యాల మండలం ధరూర్ శివారులో పోలీసులు పట్టుకున్నారు. నోట్ల ముఠా వివరాలను జిల్లా ఎస్పీ అనంతశర్మ గురువారం విలేకరులకు వివరించారు. వరంగల్ జిల్లాకు చెందిన సల్మాన్ కొద్ది సంవత్సరాలు దుబాయ్‌లో పనిచేసి వచ్చి వరంగల్‌లో ఉంటున్నాడు. ఇతని బంధువు నాసర్, హన్మకొండకు చెందిన అజీమ్‌ఖాన్, ఆర్మీ మాజీ ఉద్యోగి ఐత శ్రీనివాస్ కలసి పాత నోట్లను మార్పిడి చేయాలనుకున్నా రు. అందుకు ఐత శ్రీనివాస్ హైదరాబాద్‌కు చెందిన కాలిశెట్టి వేణుతో పాతనోట్లు మార్పిడి గురించి ఫోన్లో ఒప్పందం కుదు ర్చుకున్నాడు. పాతనోట్ల మార్పిడి గురించి ఫోన్లో మాట్లాడుతుండగా నవీన్ అనే వ్యక్తి విని వేణుతో పరిచయం పెంచుకున్నాడు. 33 శాతం పర్సంటేజీ తీసుకుని పాతనోట్లకు బదులు కొత్త నోట్లు ఇస్తానని సల్మాన్, నాసర్, అజీమ్ ఖాన్, మురళీ, శ్రీనివాస్ కాలిశెట్టి వేణుతో ఒప్పందం కుదుర్చుకు న్నాడు. ఈ మేరకు పాతనోట్లతో జగిత్యాలకు రావాలని వేణు సూచించగా ఆ ఐదుగురు స్నేహితులు ఇండికా కారులో రూ. 25.50 లక్షలు తీసుకుని వరంగల్ నుంచి జగిత్యాలకు బయలుదేరారు. పాతనోట్ల మార్పిడి జరుగుతుందన్న పక్కా సమాచారం తెలుసుకున్న జగిత్యాల రూరల్ సీఐ శ్రీనివాస్ చౌదరి, ఎస్సై కిరణ్‌కుమార్ ధరూర్ శివారులో మకాం వేసి.. కారును ఆపి చెక్ చేశారు. కారులో ఉన్న డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో సల్మాన్ పారిపోగా.. వేణు, ఐత శ్రీనివాస్, నాజర్, అజీమ్‌ఖాన్ పోలీసులకు దొరికిపోయారు. వీరిపై రిజర్వ్ బ్యాంక్ కొత్త చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నామని ఎస్పీ చెప్పారు. -
బ్యాంకులలో డబ్బులు అప్పుడే ఖాళీ!
పెద్ద నోట్ల రద్దు తర్వాత.. వాటిని మార్చుకోడానికి బ్యాంకులకు వెళ్లినవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. రెండో శనివారం, ఆదివారం కూడా బ్యాంకులు పనిచేస్తాయని ప్రకటించినా, తీరా అక్కడకు వెళ్లేసరికి డబ్బులు అయిపోయాయని మొండిచేతులు చూపిస్తున్నారు. కావాలంటే డబ్బులు మీ ఖాతాలలో డిపాజిట్ చేసుకోవచ్చని, తర్వాత ఏటీఎంలు ఎక్కడైనా పనిచేస్తే, వాటిలో తీసుకోవచ్చని బ్యాంకు సిబ్బంది చెబుతున్నట్లు వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఉషారాణి అనే గృహిణి 'సాక్షి'కి తెలిపారు. తమ వద్ద ఉన్న డబ్బులతో కనీసం పెట్రోలు పోయించుకోవడమో, బస్ పాస్‌లు రెన్యువల్ చేయించుకోవడం లాంటి పనులు అవుతాయని.. అదే బ్యాంకులో డిపాజిట్ చేస్తే చేతిలో డబ్బులు కూడా ఉండవని ఆమె వాపోయారు. అసలే ఏటీఎంలు ఏవీ పనిచేయడం లేదని.. వాటిముందు ఇప్పటికే నో క్యాష్ అని బోర్డులు పెట్టేశారని.. ఇలాంటి పరిస్థితులలో్ తాము బ్యాంకులలో డబ్బు డిపాజిట్ చేసుకుని ప్రయోజనం ఏంటని అడిగారు. అసలు డబ్బు లేకుండా బ్యాంకులు శని, ఆదివారాల్లో తెరిచి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. చాలామంది ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులు కావడంతో ఈ రెండు రోజుల్లో డబ్బు మార్చుకోవచ్చని ఇన్నాళ్లూ ఎలాగోలా ఆఫీసులకు వెళ్లిపోయారు. తీరా చూస్తే.. శనివారం ఉదయం 10.30 గంటల సమయానికే అసలు బ్యాంకులలో డబ్బులు లేవంటున్నారని.. పైగా, ఆ బ్యాంకులో ఖాతా ఉంటే మాత్రమే డబ్బులు ఇస్తాం తప్ప లేకపోతే అసలు రానివ్వడం లేదని మరికొందరు కస్టమర్లు చెబుతున్నారు. ఏ బ్యాంకులోనైనా డబ్బులు మార్చుకోవచ్చని ఒకవైపు ప్రధానమంత్రి ప్రకటిస్తుంటే.. ఇక్కడ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అలా లేదని, కేవలం తమ ఖాతాలు ఉన్న బ్యాంకులకు మాత్రమే వెళ్లాలంటున్నారని తెలిపారు.