సంగారెడ్డి మున్సిపాలిటీ : తమకు ఇప్పటివరకు చెల్లిస్తున్న పింఛన్లను నిలిపివేయడంతో అధికారులను అడిగి తెలుసుకొనేందుకు మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆ వృద్ధులకు సమాధానమిచ్చే సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోయారు. దీంతో వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం ఎదుట నిరీక్షించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులకు సంబంధించి 274 మంది వృద్ధుల పింఛన్లను వివిధ కారణాలతో ప్రభుత్వం రద్దు చేసింది.
ఈనెల 9 నుంచి ఐకేపీ సిబ్బంది ద్వారా పింఛన్లను వార్డుల్లో పంపిణీ చేయడంతో ఎప్పటి లాగే పింఛన్ తీసుకొనేందుకు వెళ్లిన వృద్ధులకు ఈనెల పింఛను రాలేదని సిబ్బంది చెప్పడంతో వారు అవాక్కయ్యారు. కారణం తెలుసుకునేందుకు వారు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయంలో సైతం ఎవరూ లేకపోవడంతో వారు సాయంత్రం వరకు వేచి చూసి ఉసూరు మంటూ వెనుదిరిగారు.
పింఛన్ల కోసం ‘పండుటాకుల’ నిరీక్షణ
Published Tue, Oct 14 2014 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM
Advertisement