ఖమ్మం అర్బన్: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష నిర్వహణ కు ఖమ్మంలో మొత్తం 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పరీక్షల నిర్వహణ ఖమ్మం నగర కోఅర్డినేటర్, రఘునాథపాలెం ఎస్‌ఎన్ మూర్తి పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలిపారు. ఐదు కేంద్రాల్లో మొత్తం 5059 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఈనెల 31న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1గంటవరకు పరీక్ష ఉంటుందన్నారు, ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదన్నారు.
విద్యార్థులు ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి రావాలన్నారు. ఖమ్మం పరిధిలో ఎస్‌ఎన్ మూర్తి కాలేజీలో, వీవీసీపాఠశాలలో, ఎస్‌ఆర్‌ఎన్‌బిజేఎన్‌ఆర్ కాలేజీ (ఖమ్మం), ఉమేన్స్‌కాలేజి (ఖమ్మం), బల్లేపల్లి ఎస్‌ఎఫ్‌ఎస్ పాఠశాల, గాంధీ చౌక్‌లోని గాయత్రీ డిగ్రీ కాలేజీ(ఖమ్మం ) ,ఎన్‌ఎస్సీ రోడ్డులోని కవితా మోమిరియల్ కాలేజి(ఖమ్మం), ఉపేందరయ్యనగర్‌లోని కవితా డిగ్రీ కాలేజీలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
31న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష
Published Fri, May 29 2015 3:01 AM | Last Updated on Tue, Sep 18 2018 7:45 PM
Advertisement