ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు సాధించేవరకు ఉద్యమిస్తామని, ఇందుకు ప్రజాసంఘాలు కలిసి రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సమీపంలోని ఐఎంఏ హాల్‌లో ఆదివారం జరిగిన పార్టీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీపీఎం ఉద్యమిస్తుందని పునరుద్ఘాటించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
తమ్మినేని వీర భద్రం
పోచమ్మమైదాన్ : విద్యా, ఉద్యోగ రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేటు రంగంలో రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్లు అములు చేయాటానికి, వాటిని సాధించడానికి సీపీఎం ఉద్యమిస్తుందని, ఇందుకు ప్రజాసంఘాలు కలిసి రావాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఎంజీఎం సమీపంలోని ఐఎంఏ హాల్‌లో సీపీఎం జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశం సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం చుక్కయ్య అధ్యక్షతన ఆదివారం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా వీరభద్రం హాజరై మాట్లాడుతూ 81శాతం ప్రైవేటురంగం విస్తరించిందని, గత కొన్నేళ్లుగా పాలకవర్గాలు మూ కుమ్మడిగాప్రైవేటురంగాన్నిపెంచిపోషించడంతో సామాజికన్యాయంసమాధి అయ్యిం దన్నారు.
తరతరాలుగా శాస్త్రీయ కట్టుబాట్లపేరిట చదువు, సంపద, వనరులన్ని ఎస్సీ ఎస్టీ, బీసీలకు దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల విషయంలో అగ్రకుల పెత్తందారులు విషప్రచారం చేస్తున్నారని, రైల్వే రంగంలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండటంతో అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీపీఎం ఉద్యమిస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, రాము, వెంకయ్య, మెట్టు శ్రీనివాస్, దుబ్బ శ్రీనివాస్, రంగయ్య, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్, నారాయణ, మల్లారెడ్డి, బషీర్, యాదగిరి పాల్గొన్నారు.
‘ప్రైవేట్’లో రిజర్వేషన్ల సాధనకు ఉద్యమం
Published Mon, May 4 2015 3:36 AM | Last Updated on Thu, Jul 11 2019 9:08 PM
Advertisement
Advertisement