సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ముఖ్యంగా భూ రికార్డుల ప్రక్షాళన తీరును క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఈ నెల 8న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఉన్నతాధికారుల బృందం పర్యటించనుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం తుర్కగూడ, ఎర్రకుంట, మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం లక్ష్మాపూర్‌లో గతంలో రెవెన్యూ యంత్రాంగం భూ సర్వే నిర్వహించింది. భూ సర్వే రికార్డుల నవీకరణ అనంతరం తేలిన అంశాల ఆధా రంగా రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వే నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని అంచనా వేసేం దుకు అధికారులు ఈ గ్రామాల్లో పర్యటిస్తు న్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, రెవెన్యూ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, సర్వే, సెటిల్‌మెంట్ కమిషనర్ శశిధర్ ఈ గ్రామాలను సందర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment