బైక్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంగళవారం మెదక్ జిల్లా దుబ్బాక నగర పంచాయతీ పరిధిలోని చేర్వాపూర్ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరి మండలం బొల్లారం గ్రామానికి చెందిన ఎం.నర్సింగ్ యాదవ్ (32) దుబ్బాక మండలం గంభీర్‌పూర్ గ్రామంలోని అత్తగారింటికి వచ్చాడు.
హైదరాబాద్‌లో ప్రై వేట్ జాబ్ చేస్తున్న నర్సింగ్ ఉదయాన్నే బైక్‌పై బయల్దేరాడు. చెల్లాపూర్ శివారులోకి రాగానే బైక్ అదుపు తప్పి కల్వర్టుకు ఢీకొనడంతో నర్సింగ్ తలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.