
ఏక్ నిరంజన్..!
ప్రజావాణికి హాజరైన ఒకే ఒక్క అధికారి..
ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు
ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వీలుగా ప్రభుత్వం ‘ప్రజావాణి’ ఏర్పాటు చేశారు. అధికారులంతా ఒకే దగ్గర ఉండి వచ్చినసమస్యలను పరిష్కరించడం.. వివిధ శాఖల మధ్య ఉన్న సమస్యలను సమన్వయం చేసుకొని బాధితులకు న్యాయం చేసేందుకు వీలుగా ప్రతి సోమవారం అధికారులంతా ఒకే దగ్గర ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే, ఇక్కడ కూడా అధికారులు సరైన శ్రద్ధ చూపడం లేదు. గ్రీవెన్స్‌డేలకు కూడా డుమ్మా కొడుతున్నారు. సోమవారం తాండూరు మండల పరిషత్‌లో నిర్వహించిన ప్రజా దర్బార్‌కు పంచాయతీరాజ్ ఏఈ ఇసాక్ మాత్రమే హాజరయ్యారు. మిగతా వారంతా డుమ్మా కొట్టారు. దీంతో బాధితులు అధికారులకోసం వేచి చూసి వెనుదిరిగారు. 11గంటల తర్వాత ఎంపీడీఓ జగన్మోహన్‌రావు వచ్చారు. అధికారులు లేకపోవడం.. బాధితులంతా వెళ్లిపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి.
- తాండూరు రూరల్