one man
-
ఒక వరుడు.. ఇద్దరు వధువులు
భోపాల్: ప్రేమించిన అమ్మాయి, పెద్దలు చూసిన అమ్మాయి ఇద్దరితో కలిపి యువకుడికి పెళ్లి జరిగిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఈ పెళ్లి ఈ నెల 8న బేతుల్ జిల్లాలోని కెరియా గ్రామంలో అన్ని హంగులతో, బంధుమిత్రుల మధ్య ఘనంగా జరగడం గమనార్హం. గ్రామానికి చెందిన సందీప్ ఉకే తాను చదువుతుండగా ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమ నడుస్తుండగానే, అతని తల్లిదండ్రులు మరో యువతితో పెళ్లి సంబంధం కుదిర్చారు. ఈ వ్యవహారం రచ్చబండ వద్దకు చేరింది. రంగంలోకి దిగిన గ్రామ పెద్దలు మూడు కుటుంబాలను పిలిపించి మాట్లాడారు. అతడితో కలిసి ఉంటామని ఇద్దరు అమ్మాయిలు తేల్చి చెప్పారు. సందీప్ కూడా దీనికి తలూపడంతో పెళ్లి జరిగిపోయింది. మూడు కుటుంబాల వారు వారి కుటుంబసభ్యులతో హాజరై వరుడిని, వధువులను దీవించారు. గ్రామ పెద్ద మిశ్రాలాల్ ఈ పెళ్లికి ప్రధాన సాక్షిగా వ్యవహరించారు. అమ్మాయిలకు, వారి కుటుంబాలకు ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతోనే పెళ్లికి ఒప్పుకున్నట్లు ఆయన వెల్లడించారు. -
కస్టడీలో ఎమ్మెల్యే బాధిత యువతి తండ్రి మృతి
లక్నో: తన కుమార్తెపై ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసిన వ్యక్తి సోమవారం పోలీసు కస్టడీలో ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆ వ్యక్తిని ఎమ్మెల్యేపై కుట్ర పన్నుతున్నాడనే అభియోగంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై యూపీ సీఎం ఆదిత్యనాథ్ దర్యాప్తునకు ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్, ఆయన సోదరులు ఏడాది క్రితం తనను రేప్ చేశారని ఉన్నవోకు చెందిన 18ఏళ్ల అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఎమ్మెల్యేపై కేసు పెట్టని పోలీసులు.. కుట్రకు పాల్పడుతున్నాడంటూ ఆమె తండ్రిని ఈ నెల 5న అరెస్టు చేశారు. దీంతో ఆదివారం ఆ యువతి తన కుటుంబంతో సహా సీఎం ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా జైలులో ఉన్న బాధితురాలి తండ్రిని పోలీసులు అదేరోజు రాత్రి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులే తన తండ్రిని లాఠీలతో బాది చంపేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. -
కొండను తవ్వేసిన ఒకే ఒక్క మనిషి
-
కార్డులో ఒక్కరే ఉన్నా ‘దీపం’ కనెక్షన్
అనంతపురం అర్బన్ : జిల్లాలో ఇప్పటి వరకు దీపం పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్లను మహిళల పేరు మీద మాత్రమే ఇచ్చే వారు. ఈ విధానంలో ప్రభుత్వం మార్పు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. జిల్లాలో కొందరు ఒక్కరే తెల్ల రేషన్ కార్డులో సభ్యునిగా ఉన్నారు. అది ముఖ్యంగా పరుషులు మాత్రమే ఇలా (సింగిల్ మెంబర్)ఉన్నారు. సింగిల్ మెంబర్ కార్డులు జిల్లాలో 15 వేల వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు కేవలం మహిళల పేరున మాత్రమే దీపం కనెక్షన్ ఇస్తుండంతో, తెల్లకార్డు కలిగి ఉన్నప్పటికీ పురుషుడు ఒక్కరే కార్డులో సభ్యునిగా ఉన్న కారణంగా గ్యాస్ కనెక్షన్ మంజూరయ్యేది కాదు. ఇలాంటి వారికి కూడా దీపం పథకం కింద కనెక్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి జిల్లా యంత్రాగం పంపింది. ఇందుకు పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు అధికారులు తెలిపారు. సింగిల్ మెంబర్ కార్డులకూ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేలా ఉత్తర్వులను త్వరలో జారీ చేస్తామని ఉన్నతాధికారులు నుంచి సమాచారం అందిందని అధికార వర్గాలు తెలిపాయి. -
చిత్తూరు సెక్స్ రాకెట్లో నిర్ఘాంతపోయే నిజాలు !
► విదేశాలకు మహిళల తరలింపులో నోరువిప్పిన నిందితుడు ► గొలుసుకట్టులా వెళుతున్న దర్యాప్తు ► ‘ఎర్ర’ కేసుల్ని తలదంటున్న అక్రమ తరలింపు చిత్తూరు : అతనొక్కడే 90 మంది మహిళల్ని విదేశాల్లో వేశ్యా గృహాలకు తరలించాడు. మహిళలను ఉద్యోగాల పేరు చెప్పి విదేశాల్లోని వ్యభిచార గృహాల్లో విక్రయిస్తున్న ప్రధాన నిందితుడు రఫీని విచారించిన పోలీసులు పలు వివరాలను రాబట్టారు. ఉద్యోగాల పేరుతో విదేశాల్లోని వేశ్యాగృహాలకు విక్రయిస్తున్నారంటూ చిత్తూరు జిల్లా సత్యవేడులో ఓ మహిళ గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమేరకు చిత్తూరు పోలీసులు దర్యాప్తు చేశారు. ఇరవై రోజుల క్రితం చెన్నైలో తమిళనాడుకు చెందిన రఫీ, పాండియన్ అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇదే ముఠాకు చెందిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సోమేశ్వర రావు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఏసుప్రేమ, చెన్నైకి చెందిన ఫాతిమాలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. వీరంతా ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. న్యాయస్థానం అనుమతితో రఫీ, పాండియన్‌లను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా సోమవారం రఫీ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడని తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. చెన్నైకి చెందిన రఫీ చిత్తూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన పలువురు ఏజెంట్లను నియమించుకున్నాడు. భర్తతో విడిపోయిన మహిళలు, వితంతువులు, పెద్దగా బంధువులు లేనివాళ్లను, ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న వాళ్లను లక్ష్యంగా చేసుకుని విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రచారం చేసేవాడు. ఈ క్రమంలో తానొక్కడే 90 మంది మహిళల్ని మలేషియా, సింగపూర్, గల్ఫ్ దేశాలకు పంపించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. దీంతో పోలీసులు దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. దాదాపు అందర్నీ వ్యభిచార గృహాలకు అమ్మేసినట్లు చెప్పడంతో పోలీసులే షాక్‌కు గురయ్యారు. కాగా వీళ్లల్లో ఎంతమంది విదేశాల్లో ఉన్నారు..? ఎంతరు స్వదేశానికి తిరిగొచ్చారు..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మహిళల పేర్లను పాస్‌పోర్టు కార్యాలయాల్లో పరిశీలిస్తున్న పోలీసులు ఈ కేసు విచారణలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. చైన్ లింక్... మరోవైపు మహిళల అక్రమ తరలింపులో నిందితుల గుట్టు లాగే కొద్దీ ఇదో గొలుసు కట్టుగా అల్లుకుంటూ పోతోంది. గత 20 రోజుల్లో చిత్తూరు జిల్లాలో మహిళల అక్రమ తరలింపులో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఇచ్చిన నేరాంగీకార ఒప్పుకోలు పత్రంలో 40 మందికి పైగా పేర్లు చెప్పారు. వీళ్లను పట్టుకునేందుకు పోలీసులు పలు జిల్లాల్లో బృందాలుగా వెళ్లి విచారణ చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఎలాగయితే కూలీలు, మేస్త్రీలు, పైలెట్లు, జిల్లా, అంతర్ జిల్లా, అంతరాష్ట్ర, జాతీయ, విదేశీ స్మగ్లర్లు ఉన్నారో.. ఇదే తరహాలో మహిళల అక్రమ తరలింపులో కూడా వెలుగు చూస్తోంది. ఈ గూడుపుఠాణీను కిందిస్థాయి వరకు పెకలించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ వేయబోయి రైతు మృతి
కొత్తగూడెం(సంగెం) : ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ వైరును సరిచేయడానికి వెళ్లి విద్యుత్‌షాక్‌కు గురై ఓ రైతు మృత్యువాత పడిన సంఘటన మండలంలోని కొత్తగూడెంలో బుధవారం జరిగింది. స్థాని కులు, పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెం గ్రామానికి చెందిన వాసం సాంబయ్య(47) బుధవారం ఉదయం పత్తి పంటకు నీరుపెట్టేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. మోటార్ ఆన్ చేయగా నడవడం లేదు. దీంతో పక్క చేను రైతు వాసం సూరయ్యతో కలిసి గ్రామంలోని ఎస్ఎస్–2 ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లాడు. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ వేయడానికి ఏబీ స్విచ్‌ను బంద్ చేస్తున్న క్రమంలో 11 కేవీ కండక్టర్ ఏబీ స్విచ్ రాడ్‌కు తగిలింది. ఈ విషయాన్ని గమనించకపోవడంతో అతడు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే అరుస్తూ పడిపోయాడు. సాంబయ్యతో వచ్చిన సూరయ్య వెంటనే చేతులు నలుస్తూ చుట్టుపక్కల ఉన్న రైతులను పిలిచాడు. వారు వచ్చి 108కు, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. 108 సిబ్బంది వచ్చి సాంబయ్య మృతిచెందినట్లు నిర్ధారించారు. ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే సాంబయ్య మృతిచెందాడని కుటుంబ సభ్యులు, తోటి రైతులు ఆరోపించా రు. మృతుడికి భార్య బుచ్చమ్మ, కుమారులు రాధాకృష్ణ, రామకృష్ణ ఉన్నారు. ఎస్సై వి.క్రాంతికుమార్ సంఘటన స్థలానికి చేరుకొని శవ పంచానామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేందుకు హామీ విద్యుదాఘాతంతో మృతిచెందిన రైతు వాసం సాంబయ్య కుటుంబానికి ట్రాన్స్‌కో నుంచి పరిహారంగా రూ.4 లక్షలు ఆర్థిక సాయం అందించడానికి ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. -
రైలు నుంచి కిందపడి వ్యక్తి మృతి
జనగామ : వేగంగా వెళ్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ విషాద సంఘటన ఆదివారం బాణాపురం సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ కానిస్టేబుల్ సమ్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి జనగామ వైపు వస్తున్న రైలులో నుంచి శనివారం రాత్రి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. బాణాపురం శివారులో రైలు పట్టాలపై పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడి వద్ద లభించిన ఆథార్ కార్డుపై ఉన్న చిరునామా ఆధారంగా జనగామ పట్టణంలోని సంజయ్‌నగర్‌కు చెందిన గోవిందం నర్సింహ(48)గా గుర్తించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
లాడ్జిలో ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
మృతుడిది బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గతంలో ప్రేమ పెళ్లి.. హైదరాబాద్‌లో నివాసం 20 రోజులుగా కనిపించకుండా పోయిన వైనం మంచిర్యాలలో ఆత్మహత్య.. అంతుచిక్కని కారణాలు మంచిర్యాల టౌన్ : మంచిర్యాల బస్టాండు సమీపంలో గల శివసాయి లాడ్జిలో గురువారం రాత్రి సాన మహేశ్(26) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ సీఐ సుధాకర్, ఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకుని.. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామానికి చెందిన సాన మహేశ్, సోమగూడెం సమీపంలోని బొప్పరపల్లికి చెందిన దాసరి శైలజ ప్రేమించుకున్నారు. 2010 సెప్టెంబర్ 10న వీరిద్దరూ కుటుంబసభ్యులను ఎదిరించి, సోమగూడెం పోలీస్‌స్టేషన్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరువురి కులాలు వేరు కావడంతో, రెండు కుటుంబాల మధ్య అదే సమయంలో పలుమార్లు పంచాయతీలు జరిగాయి. పోలీసుల సహకారంతో పెళ్లి చేసుకున్న మహేశ్, తన భార్య శైలజను తీసుకుని హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్‌కు వెళ్లిపోయాడు. అక్కడే గదికి అద్దెకు తీసుకుని షేడి అనే ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ జీవిస్తున్నారు. వీరికి పిల్లలు లేరు. జూలై 22న కనిపించకుండా పోయి.. ఇదిలా ఉండగా ఈ ఏడాది జూలై 22న కంపెనీలో పనికి వెళ్లి, రాత్రికి ఇంటికి వస్తున్నానని, తన భార్య శైలజకు సమాచారం ఇచ్చిన మహేశ్ కనిపించకుండా పోయాడు. సెల్‌ఫోన్ కూడా స్విచ్ఆఫ్ చేయడంతో, అంతటా వెతికిన భార్య శైలజ అదే నెల 24వ తేదీన వనస్థలిపురం పోలీసులకు తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ ప్రారంభించిన అక్కడి పోలీసులు మహేశ్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ముంబయ్ వెళ్లేందుకు టిక్కెట్టు కొన్నట్లుగా సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. కానీ అతను ఎక్కడికి వెళ్లింది అంతుబట్టలేదు. మూడు రోజులుగా లాడ్జీలోనే ఉంటూ.. ఈ నెల 9న మహేశ్ మంచిర్యాల పట్టణంలోని శివసాయి లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. గురువారం రాత్రి అదే గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన మృతి విషయాన్ని తన భార్యకు, మామకు, తన సోదరుడికి చేరవేయాలంటూ వారి ఫోను నంబర్లను రాసిపెట్టి మరీ ఉరేసుకున్నాడు. లాడ్జి నిర్వాహకుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేశారు. మహేశ్ ఇంట్లో వారిని విచారించగా, పెళ్లి జరిగిన నాటి నుంచి తమ ఇంటికి రావడం లేదని చెప్పగా, భార్య శైలజ తమకు ఎలాంటి గొడవలు లేవని, కంపెనీలో అప్పుడప్పుడు అక్కడి వారితో గొడవ పడుతుండేవాడని చెప్పింది. దీంతో దర్యాప్తులో ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని, ఇప్పుడే ఏమి చెప్పలేమని సీఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
నిర్మల్ టౌన్ : పట్టణంలోని కంచెరోని చెరువు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. పట్టణ ఎస్సై సునీల్‌కుమార్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన గౌతంరెడ్డి తన నలుగురు స్నేహితులతో కలిసి ఏపీ25ఎల్ 9009 నెంబర్ కారులో నిజామాబాద్ వైపు Ðð ళ్తున్నాడు. ఈ క్రమంలో నిజామాబాద్ వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. దీంతో కారును నడుపుతున్న గౌతంరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న మిగతా వారు తీవ్ర గాయాలపాలు కాగా, వారిని మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పాముకాటుతో మేకల కాపరి మృతి
తానూరు : మండలంలోని కుప్టి గ్రామానికి చెందిన సంఘంవాడ్ యాదవ్(32) అనే మేకల కాపరి పాముకాటుతో శనివారం రాత్రి మతిచెందాడు. ఎస్సై సురేశ్ కథనం ప్రకారం... మతుడు సంఘంవాడ్యాదవ్ శనివారం ఉదయం మేకలు తీసుకువెళ్లి గ్రామ సమీపంలో మేపుతున్నాడు. అంతలో పాము కాటు వేసింది. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం ముథోల్ ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం రాత్రి నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మతిచెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. -
విష జ్వరంతో ఒకరి మృతి
కాళేశ్వరం: విషజ్వరంతో మహదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన కూలీ బద్ది స్వామి(45) మృతి చెందాడు. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న స్వామి స్థానికంగా ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నాడు. అయిన తగ్గకపోవడంతో శుక్రవారం రాత్రి మహదేవపూర్ ఆస్పత్రిలో చేరాడు. శనివారం ఉదయం పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. స్వామికిS భార్య మల్లక్క ఉంది. -
ఏక్ నిరంజన్..!
ప్రజావాణికి హాజరైన ఒకే ఒక్క అధికారి.. ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వీలుగా ప్రభుత్వం ‘ప్రజావాణి’ ఏర్పాటు చేశారు. అధికారులంతా ఒకే దగ్గర ఉండి వచ్చినసమస్యలను పరిష్కరించడం.. వివిధ శాఖల మధ్య ఉన్న సమస్యలను సమన్వయం చేసుకొని బాధితులకు న్యాయం చేసేందుకు వీలుగా ప్రతి సోమవారం అధికారులంతా ఒకే దగ్గర ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే, ఇక్కడ కూడా అధికారులు సరైన శ్రద్ధ చూపడం లేదు. గ్రీవెన్స్డేలకు కూడా డుమ్మా కొడుతున్నారు. సోమవారం తాండూరు మండల పరిషత్‌లో నిర్వహించిన ప్రజా దర్బార్‌కు పంచాయతీరాజ్ ఏఈ ఇసాక్ మాత్రమే హాజరయ్యారు. మిగతా వారంతా డుమ్మా కొట్టారు. దీంతో బాధితులు అధికారులకోసం వేచి చూసి వెనుదిరిగారు. 11గంటల తర్వాత ఎంపీడీఓ జగన్మోహన్రావు వచ్చారు. అధికారులు లేకపోవడం.. బాధితులంతా వెళ్లిపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. - తాండూరు రూరల్ -
జిలెటిన్‌స్టిక్స్ పేలి ఒకరిమృతి