సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల జాబితాల్లో చిత్రవిచిత్రాలు కనిపిస్తున్నాయి. ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓటర్లున్న విచిత్రాలు బహిరంగం కాగా, ఒక ఇంట్లో కేవలం ఒకే ఓటరున్న ఇళ్లు కూడా తక్కువేం లేవు.హైదరాబాద్ జిల్లా పరిధిలోని దాదాపు 10.36 లక్షల ఇళ్ల ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్(ఐఆర్‌ఈఆర్)లో ఇలాంటి వారి సంఖ్య 4.64 లక్షలుగా ఉంది. అంటే దాదాపు 45 శాతం మంది ఒంటరి ఓటర్లే. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సిబ్బంది హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఇంటింటికీ సర్వే చేసి పొరపాట్లు సరిదిద్దినట్లు పేర్కొన్నప్పటికీ, చాలా వరకు సర్వేలు సరిగ్గా జరగలేదని వివిధ రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి.
ఇటీవల రాజకీయ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో బీజేపీ నేత పి. వెంకటరమణ ఈ విషయాలు వెల్లడించారు. ఎన్నికల సిబ్బంది మొక్కుబడి తంతుగా జాబితాల సవరణ చేస్తున్నందునే ఓటరు జాబితాలో పొరపాట్లుంటున్నాయని పలువురు రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లు ఉండటం మాత్రమే ఇప్పటి వరకు వెల్లడికాగా, ఒక ఇంట్లో ఒక్క ఓటరు మాత్రమే ఉన్న ఇళ్లు కూడా భారీగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment