
ఔను.. అప్పట్లో తెలంగాణను వ్యతిరేకించా..!
కానీ రాష్ట్రం ఇంత గొప్పగా ఉంటుందనుకోలేదు: తలసాని
పటాన్‌చెరు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఉద్యమ సమయంలో తాను వ్యతిరేకించింది వాస్తవమేనని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సాధించుకున్న రాష్ట్రం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఇంత గొప్పగా ఉంటుందని తాను ఆనాడు ఊహించలేదన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో గొర్రె కాపరులు, మత్స్యకారుల సహకార సంఘాల సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.