మూడు ‘పూలు’.. ఆరు‘కాయలు’
- సేంద్రియ ఎరువుతో కూరగాయల సాగు
- వానపాములు, కుళ్లిన పదార్థాలతో వర్మీకంపోస్టు తయారీ
- అధిక దిగుబడి సాధిస్తున్న మోహన్‌రావుపేట యువరైతు
రాజుకు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ఎకరంలో కూరగాయలు, రెండెకరల్లో మొక్కజొన్న, మిగిలిన రెండెకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. ప్రభుత్వం అందించిన వర్మీ బెడ్స్, సబ్సిడీని ఉపయోగించుకుని స్వయంగా వర్మీకంపోస్టు ఎరువును తయారు చేసుకుంటూ పొలాన్ని సారవంతంగా మార్చుకుంటున్నాడు. పశువుల పేడ, కుళ్లిన పదార్థాలు పోగుచేసి వానపాములను పెంచి రెండు నెలలకోమారు టన్ను సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నాడు.
బెండ, వంకాయ సాగు
ఎకరం భూమిలో 10 గుంటల్లో వంకాయ, మిగిలిన 30గుంటల్లో బెండ సాగు చేస్తున్నాడు. రెండు నెలలు బెండ, మరో రెండు నెలలు టమాట, ఆర్నెల్లు వంకాయ సాగుచేస్తానని, పంట మార్పిడి తప్పకుండా ఉంటుందంటున్నాడు రాజు. సేంద్రియ ఎరువులతో సాగు చేయడం ద్వారా కూరగాయలు తాజాగా ఉంటాయని, మార్కెట్‌లోనూ గిరాకీ అధికంగా ఉంటోందని పేర్కొంటున్నాడు. పండించిన కూరగాయలను కోరుట్ల, చుట్టూ పక్కల గ్రామాలకు తీసుకెళ్లి విక్రయిస్తానని, ప్రస్తుతం రేట్లు అధికంగా ఉండడంతో ఆదాయం భారీగానే వస్తోందని పేర్కొంటున్నాడు.
ఈయన సిరిసిల్ల మండలం పెద్దబోనాలకు చెందిన కాశెట్టి శ్రీనివాస్. తనకున్న ఎకరం పొలంలో ఆరురకాల కూరగాయలు సాగు చేస్తున్నాడు. బీర, అనపుకాయ, బెండ, టమాట, వంకాయ, మిర్చి, అల్చింత పండిస్తున్నాడు. ఈ రకాలన్నీ 45 రోజుల నుంచే కోతకు వస్తున్నాయి. పెద్ద బోనాల సిరిసిల్లకు సమీపంలో ఉండడంతో రవాణాకు పెద్దగా ఇబ్బంది లేకుండాపోయింది శ్రీనివాస్‌కు. నిత్యం కూరగాయలను మార్కెట్‌కు తరలిస్తూ ఆదాయాన్ని పొందుతున్నాడు. కరువు పరిస్థితుల నేపథ్యంలో కుటుంబ అవసరాలు తీరుతున్నాయంటున్నాడీ రైతు. - సిరిసిల్ల