సాక్షి, హైదరాబాద్: ‘తెలుగు వెలుగులు ప్రపంచానికి చాటుదాం.. తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటుకుందాం’నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎల్బీ స్టేడియానికి పాల్కురికి సోమనాథ ప్రాంగణంగా.. ప్రధాన వేదికకు బమ్మెర పోతన వేదికగా నామకరణం చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మహాసభలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే మహాసభల ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్యఅతిథిగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, విశిష్ట అతిథులుగా రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు హాజరవుతారు. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు మహాసభల ప్రధాన వేదికతో పాటుగా ఉప వేదికల్లో సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఐదు రోజుల పాటు జరగనున్న మహాసభల వివరాలు ఇలా ఉన్నాయి.
ఎల్బీ స్టేడియంలో కార్యక్రమాల వివరాలివీ..
15శుక్రవారం
సాహిత్య సమావేశం: సాయంత్రం 6 గంటలకు
అధ్యక్షత :డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ,ఉపాధ్యక్షుడు, తెలుగు విశ్వవిద్యాలయం
ముఖ్యఅతిథి : హరీశ్‌రావు, భారీనీటిపారుదల మంత్రి
గౌరవ అతిథి : ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్, చెన్నై
సత్కారం : సీతాకాంత్ మహాపాత్ర, ప్రతిభారాయ్‌లకు (ఒడిశా జ్ఞానపీఠ పురస్కార స్వీకర్తలు)
సాయంత్రం 6.30–7–00: ‘మన తెలంగాణ’ సంగీత నృత్యరూపకం.
డాక్టర్ రాజారెడ్డి–రాధారెడ్డి, కూచిపూడి కళాకారుల నృత్య ప్రదర్శన.
రాత్రి 7.00–7:30: పాటకచేరీ(శ్రీరామాచారి బృందం, లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ)
రాత్రి 7:30–9:00: జయ జయోస్తు తెలంగాణ(సంగీత నృత్య రూపకం)
రచన: దేశిపతి శ్రీనివాస్, సంగీతం: ఎం.రాధాకృష్ణన్, నృత్య దర్శకత్వం: కళాకృష్ణ
16శనివారం
‘తెలంగాణలో తెలుగు భాషా వికాసం’సాహిత్య సభ
అధ్యక్షత: డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి
ముఖ్యఅతిథి: కడియం శ్రీహరి, ఉప ముఖ్యమంత్రి
గౌరవ అతిథి: ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
వక్తలుడాక్టర్ రవ్వా శ్రీహరి, డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి, డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ
సాయంత్రం 6:30 : సాంస్కృతిక సమావేశం
అధ్యక్షుడు: డాక్టర్ అయాచితం శ్రీధర్, అధ్యక్షుడు, గ్రంథాలయ పరిషత్
ముఖ్యఅతిథి: సిరికొండ మధుసూదనాచారి, శాసనసభాపతి
గౌరవ అతిథి: తనికెళ్ల భరణి
రాత్రి 7:00–7:30: హైదరాబాద్ సోదరుల ‘శతగళ సంకీర్తన’(రామదాసు సంకీర్తనల ఆలాపన)
రాత్రి 7:30–7:45: మైమ్ కళాకారుడు మధు మూకాభినయ ప్రదర్శన
రాత్రి 7:45–8:00: వింజమూరి రాగసుధ నృత్య ప్రదర్శన
రాత్రి 8:00–8:15: షిర్నికాంత్ బృంద కూచిపూడి నృత్యం
రాత్రి 8:15–9:00: డాక్టర్ అలేఖ్య ‘రాణి రుద్రమదేవి నృత్యరూపకం’
17ఆదివారం
సాయంత్రం 5 గంటలకు: ‘మౌఖిక వాఙ్మయం భాష’సాహిత్య సభ
అధ్యక్షత : డాక్టర్ వెలిచాల కొండలరావు
ముఖ్యఅతిథి : తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర మంత్రి
గౌరవ అతిథి: ఆచార్య కొలకలూరి ఇనాక్
సత్కారం: సత్యవ్రత శాస్త్రి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ఢిల్లీ
భాష–నుడికారం: డాక్టర్ నలిమెల భాస్కర్, సామెతలు జాతీయాలు: కసిరెడ్డి వెంకట్‌రెడ్డి
పద, గేయ కవిత్వం: గోరటి వెంకన్న,
సాయంత్రం 6:30: సాంస్కృతిక సమావేశం
అధ్యక్షుడు: దేవులపల్లి ప్రభాకర్‌రావు
ముఖ్యఅతిథి: స్వామిగౌడ్, మండలి అధ్యక్షుడు
గౌరవ అతిథి: డాక్టర్ ద్వానాశాస్త్రి
రాత్రి 7.00–8.00: రసమయి బాలకిషన్ సారథ్యంలో కళా ప్రదర్శన
8–00–8.15: జానపద గేయాలు–కళా మీనాక్షి
8.15–8.30: జానపదం–నృత్య కళాంజలి
8.30–8.50: జానపద నృత్యం–మంగళ, రాఘవరాజ్ భట్
8.50–9.30: జానపద జాతర
18సోమవారం
సాయంత్రం 5 గంటలకు: ‘తెలంగాణ పాటజీవితం’ సాహిత్య సభ
అధ్యక్షత : డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ
ముఖ్యఅతిథి : ఈటల రాజేందర్, ఆర్థిక మంత్రి
గౌరవ అతిథి : సిరివెన్నెల సీతారామశాస్త్రి
వక్తలు: రసమయి బాలకిషన్, జయరాజు, దేశిపతి శ్రీనివాస్
సాయంత్రం 6:30: సాంస్కృతిక సమావేశం,
అధ్యక్షత: దిల్‌రాజు
ముఖ్యఅతిథి: కేటీఆర్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి,
గౌరవ అతిథి: అక్కినేని నాగార్జున
సాయంత్రం 6.30–7.00: మలేసియా తెలుగు వారి సాంస్కృతిక కదంబ కార్యక్రమం
రాత్రి 7.00: సినీసంగీత విభావరి, సినీ మ్యూజీషియన్స్ యూనియన్
19మంగళవారం
సాయంత్రం 5 గంటలకు: ప్రపంచ తెలుగు మహాసభల సమాపనోత్సవం
ముఖ్యఅతిథి రాష్ట్రపతి : రామ్‌నాథ్ కోవింద్
విశిష్ట అతిథిగవర్నర్ : ఈఎస్‌ఎల్ నరసింహన్
సభాధ్యక్షత : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
ఇతర వేదికలు - కార్యక్రమాలు
అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం(ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, పబ్లిక్‌గార్డెన్), వానమామలై వేదిక
16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 19వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు బృహత్ కవి సమ్మేళనం(ఏడు వందల మంది కవులతో కవి సమ్మేళనం)
మరింగంటి సింగరాచార్యుల ప్రాంగణం (తెలంగాణ సారస్వత పరిషత్తు సభా భవనం),శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదిక
16వ తేదీ నుంచి 19 వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శతావధానం
పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్ (రవీంద్రభారతి)
16వ తేదీ నుంచి 19 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు యువ చిత్రోత్సవం
ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీ(రవీంద్రభారతి)
16వ తేదీ నుంచి 19 వరకు కార్టూన్ ప్రదర్శన
రవీంద్రభారతి ప్రాంగణం
16వ తేదీ నుంచి 19 వరకు ఛాయాచిత్ర ప్రదర్శన
ఛాయాచిత్ర ప్రదర్శన: చిత్రమయి ఆర్ట్ గ్యాలరీ, మాదాపూర్
బిరుదురాజు రామరాజు ప్రాంగణం(తెలుగు వర్సిటీ ఆడిటోరియం), సామల సదాశివ వేదిక
16వ తేదీ కార్యక్రమాలు
ఉ.10 గం: తెలంగాణ పద్య కవితా సౌరభం (సదస్సు)
మ.3 గం: తెలంగాణ వచన కవితా వికాసం (సదస్సు)
17వ తేదీ కార్యక్రమాలు
ఉదయం 10 గంటలు: కథా సదస్సు
మధ్యాహ్నం 3 గంటలు: తెలంగాణ నవలా సాహిత్యం
సాయంత్రం 6 గంటలు: కథా, నవలా, రచయితల గోష్ఠి
18వ తేదీ కార్యక్రమాలు
ఉదయం 10 గంటలు: తెలంగాణ విమర్శ–పరిశోధన
మధ్యాహ్నం 3 గంటలు: శతక, సంకీర్తనా, గేయ సాహిత్యం
సాయంత్రం 6 గంటలు: కవి సమ్మేళనం
19వ తేదీ కార్యక్రమాలు
ఉదయం 10 గంటలు: తెలంగాణలో తెలుగు భాషా సదస్సు
గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ ప్రాంగణం (రవీంద్రభారతి సమావేశ మందిరం), ఇరివెంటి కృష్ణమూర్తి వేదిక
16వ తేదీ కార్యక్రమాలు
ఉదయం 10 గంటలు: అష్టావధానం
మధ్యాహ్నం 12:30: హాస్యావధానం
మధ్యాహ్నం 3 గంటలు: పద్యకవి సమ్మేళనం
17వ తేదీ కార్యక్రమాలు
ఉదయం 10 గంటలు: జంట కవుల అష్టావధానం
మధ్యాహ్నం 12:30: అక్షర గణితావధానం
మధ్యాహ్నం 3 గంటలు: అష్టావధానం
సాయంత్రం 5:30: నేత్రావధానం
సాయంత్రం 6 గంటలు: శ్రీప్రతాపరుద్ర విజయం(రూపకం)
18వ తేదీ కార్యక్రమాలు
ఉ.10 గంటలు: పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో తెలుగు
మ.3 గం: న్యాయ వ్యవహారాలు, ప్రభుత్వ పాలనలో తెలుగు
19వ తేదీ కార్యక్రమాలు
ఉదయం 10 గంటలు: తెలంగాణ చరిత్ర(సదస్సు)
డాక్టర్ యశోధారెడ్డి ప్రాంగణం(రవీంద్రభారతి), బండారు అచ్చమాంబ వేదిక
16వ తేదీ కార్యక్రమాలు
ఉదయం 10 గంటలు: బాల సాహిత్యం(సదస్సు)
మధ్యాహ్నం 4 గంటలు: హరికథ(లోహిత)
మ.4:30: నృత్యం(వైష్ణవి) మ.4:45: సంగీతం(రమాశర్వాణి)
17వ తేదీ కార్యక్రమాలు
ఉదయం 10 గంటలు: బాలకవి సమ్మేళనం
మధ్యాహ్నం 3 గంటలు: తెలంగాణ వైతాళికులు(రూపకం)
18వ తేదీ కార్యక్రమాలు
ఉ.10 గం: తెలంగాణ మహిళా సాహిత్యం (సదస్సు)
మధ్యాహ్నం 3 గంటలు: కవయిత్రుల సమ్మేళనం
19వ తేదీ కార్యక్రమాలు
ఉ.10 గం: ప్రవాస తెలుగువారి భాషా సాంస్కృతిక విద్యా విషయాలు (విదేశీ తెలుగువారితో గోష్ఠి)
మ.2 గం: ప్రవాస తెలుగువారి భాషా సాంస్కృతిక విద్యా విషయాలు(రాష్ట్రేతర తెలుగువారితో గోష్ఠి)
Comments
Please login to add a commentAdd a comment