ఓయూ దూరవిద్య ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశానికి మార్చి 6 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు డెరైక్టర్ ప్రొఫెసర్ హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు.
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ దూరవిద్య ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశానికి మార్చి 6 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు డెరైక్టర్ ప్రొఫెసర్ హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల విద్యార్థులకు అసైన్‌మెంట్స్‌కు 20 మార్కులను వేయనున్నట్లు చెప్పారు.
డిగ్రీ విద్యార్థులు ఈ నెల 28 వరకు అసైన్‌మెంట్స్ అందజేయాలన్నారు. ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానున్న ఎంబీఏ మొదటి సెమిస్టర్ పరీక్షకు మార్చి 20 వరకు అసైన్‌మెంట్స్ అందజేయాలి. పీజీ కాంటాక్టు క్లాసెస్ మార్చి మొదటి వారం నుంచి ప్రారంభంకానునట్లు డెరైక్టర్ తెలిపారు.