మా బడి.. మాకే కావాలి
హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు విద్యార్థుల లేఖలు
పెద్దపల్లి రూరల్: ‘మా బడి మాకే కావాలి.. మా పాఠశాలను తిరిగి ప్రారంభించేలా అధికారులకు ఆదేశాలివ్వండి..’ అంటూ పెద్దపల్లి జిల్లాలోని బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు గురువారం లేఖలు రాశారు. ప్రభుత్వం పాఠశాలలను మూసివేయవద్దంటూ అధికారులను ఆదేశించినప్పటికీ ఆ ఉత్తర్వులను అమలు చేయడం లేదంటూ ఉత్తరాల్లో పేర్కొన్నారు.
పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిందన్న నెపంతో ఇక్కడ పని చేసే ఉపాధ్యాయులను వివిధ పాఠశాలలకు డిప్యుటేషన్‌పై పంపించి తమ చదువులకు ఆటంకం కలిగించడం సరికాదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ పాఠశాలను పునఃప్రారంభించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని చీఫ్ జస్టిస్‌ను లేఖల ద్వారా వేడుకున్నారు.