మాది కోతల బడ్జెట్ కాదు: కేసీఆర్ | ours is not budget of boasting, says kcr | Sakshi
Sakshi News home page

మాది కోతల బడ్జెట్ కాదు: కేసీఆర్

Published Fri, Nov 28 2014 2:55 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

మాది కోతల బడ్జెట్ కాదు: కేసీఆర్ - Sakshi

మాది కోతల బడ్జెట్ కాదు: కేసీఆర్

తమది కోతల బడ్జెట్ కాదని.. అధికారులు తగినంతగా లేకపోయినా పాలన కొనసాగిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆయన సమాధానం చెప్పారు. సుమారు లక్షా 600 కోట్లతో తాము బడ్జెట్ ప్రవేశపెట్టామని, వచ్చే సంవత్సరం బడ్జెట్ను త్వరలోనే ప్రవేశపెడతామని కేసీఆర్ తెలిపారు.

కొత్త రాష్ట్రం ఏర్పడి ఆరు నెలలైనా ఇంతవరకు ఉద్యోగుల విభజన జరగలేదని, అధికారులు తగినంతగా లేకపోయినా పాలన సాగిస్తున్నామని ఆయన అన్నారు. చెరువుల పునరుద్ధరణ, వాటర్ గ్రిడ్ పనులకు వేలకోట్లు కేటాయించామన్నారు. చెరువుల పునరుద్ధరణకు రూ. 25-30 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement