ఇంకా పడాలే..44 శాతం తక్కువగా వానలు | Padale44 percent more rains | Sakshi
Sakshi News home page

ఇంకా పడాలే..44 శాతం తక్కువగా వానలు

Published Sat, Aug 2 2014 3:20 AM | Last Updated on Thu, Oct 4 2018 5:08 PM

ఇంకా పడాలే..44 శాతం తక్కువగా వానలు - Sakshi

ఇంకా పడాలే..44 శాతం తక్కువగా వానలు

  •       ముసురుతో కొంతే మేలు
  •      పడావుగా 31 శాతం భూములు
  •      వరి నాట్లకు దాటిపోతున్న అదను
  •      భారీగా తగ్గిన వరి సాగు
  •      ఈ వారంలో వచ్చే వానలే కీలకం
  • సాక్షిప్రతినిధి, వరంగల్ : ఖరీఫ్ సీజన్ సగం ముగిసింది. వరుణుడు మాత్రం కరుణించడం లేదు. చిన్నపాటి జల్లులు తప్పితే భారీ వర్షాలు రావడం లేదు. సీజన్‌లో ఇప్పటికీ గట్టి వానలు కురిసిన దాఖలాలు లేవు. వానల తీరు సరిగా లేకపోవడంతో మెట్ట పంటలు సైతం సాధారణ స్థాయిలో సాగు కాలేదు. ప్రధాన ఆహార పంట అయిన వరి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉంది. వరి సాగుకు అదను దాటిపోతోంది. ఇప్పటికే నాట్లు ఆలస్యమయ్యాయి. ఈ వారంలో కురిసే వర్షాలతోనే వరి సాగు పరిస్థితి ఆధారపడనుంది.

    రెండు రోజుల క్రితం వరకు కురిసిన ఓ మోస్తరు వర్షాలు.. పంటలకు కొంత ఊపిరి పోశాయి. ఈ వానలతో పత్తి, మొక్కజొన్న వంటి మెట్ట పం టలకు వారం వరకు ఇబ్బంది లేకుండా ఉంది. బావులు, బోర్లు కింద కొంత వరకు రైతుల ము సురు వానలతో నాట్లు వేసుకున్నారు. ఇలా సాగై న విస్తీర్ణం కూడా తక్కువే ఉంది. వరి సాగు పుం జుకోవాలంటే వారంలోపే భారీ వర్షాలు రావాలి. అరుుతే, వానలు వస్తాయని భావిస్తుంటే మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. శు్ర2కవారం జిల్లా వ్యాప్తంగా వేసవిని తలపించేలా ఎండ మండిపోయింది.
     
    44 శాతం తక్కువగా వానలు...
     
    ప్రస్తుత ఏడాది సాగుకు సరిపడా వానలు రావడం లేదు. వేసవి ఆఖరు నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఖరీఫ్ సీజను సగం గడిచినా ఇప్పటికీ ఒక్క భారీ వర్షం కురియ లేదు. ఖరీఫ్ సీజనులో అన్ని పంటల విత్తనాలు, నారు వేసేందుకు అనువైన జూన్, జూలైలో కలిపి జిల్లాలో 424.9 మిల్లీ మీటర్ల వర్షం కురవాలి. కానీ, కేవలం 238.2 మిల్లీ మీటర్ల వర్షాలే వచ్చాయి. ఇలా సాధారణం కంటే 44 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సీజనులో మొదటి రెండు నెలల్లో ఇలా తక్కువ వర్షపాతం నమోదుకావడం పదేళ్లలో ఇదే మొదటిసారి అని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. జూన్‌లో కేవలం ఐదు రోజులు, జూలైలో 14 రోజులు మాత్రమే జిల్లాలో వానలు కురిశాయి. ఇది కూడా కొన్ని ప్రాంతాల్లోనే జల్లులు పడ్డాయి.
     
    31 శాతం తక్కువగా సాగు...
     
    జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 5,03,605 హెక్టార్లు. జూలై ఆఖరు వరకు మెట్ట పంటల విత్తనాలు వేసే పనులు పూర్తి కావాలి. వరి నాట్లు కూడా 74 శాతం పూర్తవ్వాలి. కానీ, ఇప్పటి వరకు 3,48,900 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఆశించిన స్థాయిలో వానలు రాకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో పంటలు వేసే భూముల్లో ఇంకా 31 శాతం ఖాళీగానే ఉన్నాయి. వరి సాగు చేసే భూములే ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆగస్టు మొదటి వారంలో భారీ వర్షాలు రాకపోతే వరి సాగు అదను పూర్తిగా దాటిపోతుంది. ఖరీఫ్ సాగు పరిస్థితి మెరుగుపడడానికి.. వచ్చే ఏడు రోజుల సమయం కీలకం కానుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement