ప్రశాంతంగా పాలిసెట్ కౌన్సెలింగ్ | Paliset as peaceful counseling | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా పాలిసెట్ కౌన్సెలింగ్

Published Sat, Jun 27 2015 12:31 AM | Last Updated on Tue, Sep 18 2018 7:45 PM

Paliset as peaceful counseling

మెదక్‌టౌన్: పాలిసెట్-2015 కౌన్సెలింగ్ శుక్రవారం మెదక్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రశాంతంగా కొనసాగింది. రెండో రోజు 14,001వ ర్యాంకు నుండి 28,000వేల ర్యాంకు అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్‌కు 380 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి, రిజిస్ట్రేషన్ చేయించారు. కులధృవీకరణ పత్రాలను ఏఎస్‌డబ్ల్యుఓ వసంత, బీసీ వెల్ఫేర్ అధికారులు పరిశీలించారు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంకులో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కో ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
 
 రాజగోపాల్‌పేటలో
 నంగునూరు : రాజగోపాల్‌పేటలోని పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన పాలీసెట్ కౌన్సెలింగ్‌కు విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు మొత్తం 235 మంది విద్యార్థులకు  కౌన్సెలింగ్ నిర్వహించి సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పాలీసెట్ కోఆర్డినేటర్ జీ. మోహన్‌బాబు మాట్లాడుతూ రెండవ రోజు 14,001 ర్యాంక్ నుంచి 28,000 వరకు కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement