Paliset -2015
-
ప్రశాంతంగా పాలిసెట్ కౌన్సెలింగ్
మెదక్‌టౌన్: పాలిసెట్-2015 కౌన్సెలింగ్ శుక్రవారం మెదక్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రశాంతంగా కొనసాగింది. రెండో రోజు 14,001వ ర్యాంకు నుండి 28,000వేల ర్యాంకు అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్‌కు 380 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి, రిజిస్ట్రేషన్ చేయించారు. కులధృవీకరణ పత్రాలను ఏఎస్‌డబ్ల్యుఓ వసంత, బీసీ వెల్ఫేర్ అధికారులు పరిశీలించారు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంకులో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కో ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. రాజగోపాల్‌పేటలో నంగునూరు : రాజగోపాల్‌పేటలోని పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన పాలీసెట్ కౌన్సెలింగ్‌కు విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు మొత్తం 235 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పాలీసెట్ కోఆర్డినేటర్ జీ. మోహన్‌బాబు మాట్లాడుతూ రెండవ రోజు 14,001 ర్యాంక్ నుంచి 28,000 వరకు కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. -
పాలీసెట్ కౌన్సెలింగ్ షురూ
మెదక్‌టౌన్: పాలీసెట్-2015 కౌన్సెలింగ్ గురువారం మెదక్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైంది. మొదటిరోజు 1వ ర్యాంకు నుంచి 14 వేల ర్యాంకు వచ్చిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్‌కు జిల్లా నలుమూలల నుంచి 270 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అధికారులు అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి, రిజిస్ట్రేషన్ చేయించారు. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వద్ద రూ.150ల చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లను ఏఎస్డబ్ల్యూఓ వసంత, బీసీ సంక్షేమా శాఖ అధికారులు పరిశీలించారు. రాజగోపాల్‌పేటలో.. నంగునూరు: రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం పాలీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 179 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఈసందర్భంగా పాలీసెట్ కౌన్సెలింగ్ కో ఆర్డినేటర్ మోహన్‌బాబు మాట్లాడుతూ మొదటి రోజు ఒకటో ర్యాంక్ నుంచి 14,000 ర్యాంక్ వరకు కౌన్సెలింగ్ నిర్వహించి సర్టిఫికెట్లను పరిశీలించామన్నారు. కౌన్సెలింగ్‌కు అన్ని సర్టిఫికెట్లను వెంట తెవాలన్నారు. జిల్లాలో రెండు సెంటర్లలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు.