నెక్కొండ: అక్రమంగా పామాయిల్‌ను నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అయిల్‌స్టోర్‌పై దాడి చేశారు. ఈ సంఘటన శనివారం వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని జరిగింది. వివరాలు.. మండల కేంద్రంలోని తిరుమల అయిల్ స్టోర్‌లో అక్రమంగా పామాయిల్ నిల్వ చేసినట్టు అధికారులకు సమాచారం రావడంతో దాడి చేశారు. ఈ దాడిలో రూ. 11 లక్షల విలువ చేసే పామాయిల్‌ను నిల్వ ఉంచినట్లు గుర్తించి అధికారులు ఆయిల్ నిల్వలను సీజ్ చేశారు. యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.