సాక్షి, యాదాద్రి : అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిస్థాయి ఆధిపత్యం కనబరిచేందుకు టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. జిల్లాలో డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 5 స్థానాలకు 3 చోట్ల గెలు పొంది ఉత్సాహంతో ఉన్న టీఆర్‌ఎస్.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అదే ఊపు కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. ప్రధానంగా భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సర్పంచ్‌ల గెలుపు బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు. పార్టీ ఆదేశాలతో ఇప్పటికే సర్పం చ్‌ల అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యారు.
అయితే రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలో ఉండటంతో ఆపార్టీ టికెట్ల కోసం గ్రామాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. తమకు అంటే తమకు టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యేలను కోరుతున్నారు. 50శాతం జనరల్ స్థానాలు కావడంతో పోటీ తీవ్రమైంది. జనరల్ స్థానాల్లో అధికార పార్టీలో టికెట్ల కోసం పదుల సంఖ్యలో ఆశావహులు పోటీ పడుతున్నా రు. అయితే టికెట్ కోసం ఆశపడుతున్న వారిని బుజ్జగించే ప్రయత్నంలో అధికార పార్టీ నేతలు బిజీగా ఉన్నారు. జిల్లాలో స్థానికంగా పట్టుకలిగే సర్పంచ్ పదవులు గెలిపించుకోవడం ద్వారా వచ్చే పార్లమెంట్, మున్సిపల్ సహకార ఎన్నికల్లో ముందుకు పోవాలని టీఆర్‌ఎస్ నాయకత్వం పక్కా ప్రణాళిక వేస్తుంది.
కాంగ్రెస్‌లోనూ పోటాపోటీ..
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన కాంగ్రెస్ పట్టుకోసం ప్రయత్నాలు ము మ్మరం చేసింది. ఇందులో భాగంగా గ్రామ పంచా యతీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న సంకల్ప ంతో సిద్ధమవుతుంది. అయితే నాయకత్వం మ ద్దతు ఆశిస్తున్న వారు గ్రామాల్లో అధికంగా ఉన్నా రు. శాసనసభ ఎన్నికల్లో కోల్పోయిన పట్టును తిరిగి సంపాదించాలంటే గ్రామస్థాయిలో గెలుపు గుర్రాలను నిలపాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి.
డబ్బులే ప్రధానం!
గ్రామపంచాయతీకి ఈనెల 21, 25, 30తేదీల్లో జరిగే ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థులకు డబ్బులు పెద్ద ఎత్తున ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ఆశావాహులు లక్షల్లో వెచ్చించడానికి ముందుకు వస్తున్నారు. అయితే అధికార పార్టీతోపాటు ప్రతిపక్షాల్లో కూడా డబ్బు సంచులతో ముందుకు వస్తున్న ఆశావాహుల సంఖ్య పెరగడంతో వారిని బుజ్జగించడం నేతలకు తలనొప్పిగా మారింది. రానున్న సింగిల్‌విండో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు కల్పిస్తామని నచ్చజెప్పి పోటీ నుంచి ఉపసంహరించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఏకగ్రీవానికి ప్రాధాన్యత
ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో ఏకగ్రీవానికి అధిక ప్రా« దాన్యతను ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తుంది. ప్రధానంగా చిన్న గ్రామపంచాయతీలు, నూతన గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవంగా పాలకవర్గాలు ఎంపికైతే ప్రభుత్వం రూ.10లక్షలు, స్థానిక ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.10లక్షలు మొత్తం రూ.25లక్షలు గ్రామానికి కేటాయిస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఏకగ్రీవ పంచాయతీలు చేయాలని అధికార పార్టీ ప్రయత్నిస్తుంది. ఆలేరు నియోజకవర్గంలో మూడు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.
మూడు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం..?
యాదగిరిగుట్ట : మండలంలోని మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కానున్నట్లు తెలిసింది. ఇందులో ఎస్టీ మహిళా రిజర్వేషన్ అయిన లప్పానాయక్‌తండాలో ధీరావత్ బుజ్జి, బీసీ మహిళా రిజర్వుడు స్థానం మహబూబ్‌పేటలో ఆరె రమ్య ఎన్నికయ్యే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన కంఠంగూడెం గ్రామ పంచాయతీ జనరల్ స్థానం కావడంతో అక్క డ కంటం లక్ష్మీనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment