సాక్షి, హైదరాబాద్: పంచాయతీ రాజ్ చట్టం ప్రకారమే గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రిజర్వేషన్ల విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. హైకోర్టులో సోమవారం దీనిపై విచారణ జరుగుతుందని, ఆదేశాలు వస్తాయని అధికారులు భావించారు. వివిధ కారణాల వల్ల ఈ పిటిషన్ బెంచ్ మీదకు రాలేదని అధి కారులు వెల్లడించారు.
రాజ్యాంగం నిర్దేశించిన నిబంధనల మేరకే రిజర్వేషన్లున్నాయని అఫిడవిట్‌లో నివేదించారు. ఎస్సీలకు 20.46 శాతంతో 2,070 పంచాయతీలను అధికారు లు కేటాయించారు ఎస్టీలకు 5,73 శాతంతో 580 గ్రామ పంచాయతీలు రిజర్వయ్యాయి, 100 శాతం షెడ్యూల్డు తెగలున్న 2,637 పంచాయతీలను ఎస్టీ లకే కేటాయించారు. బీసీలకు 34 శాతంతో 3,440 గ్రామ పంచాయతీలను కేటాయించారు. జనరల్ కేటగిరీలో 4,027 గ్రామ పంచాయతీలున్నాయి, వీటిపైనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం విచారణ జరగలేదు. మంగళవారం దీనిపై విచారణ జరుగుతుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి, హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చేదాకా రిజర్వేషన్ల ప్రక్రియపై అస్పష్టత కొనసాగనుంది.
చట్ట ప్రకారమే పంచాయతీ రిజర్వేషన్లు
Published Tue, Jun 26 2018 1:13 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment