ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, మానుకోట
సాక్షి, మహబూబాబాద్ : లైంగిక దాడులు ఆగడంలేదు.. ఎన్ని కఠిన చట్టాలు ఉన్నా మార్పు కనిపించడం లేదు.. అభంశుభం తెలియని పసిపాపలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. నర్సింహులపేట జయపురం గ్రామంలో మూడేళ్ల చిన్నారిపై సోమవారం జరిగిన లైంగికదాడి ఘటన జిల్లాలోని తల్లిదండ్రులను కలవరానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మగ పిల్లలకు తోటి పిల్లలు, ముఖ్యంగా బాలికలు, మహిళలను ఏవిధంగా గౌరవించాలో తెలియజేయాల్సి ఉంది.
తమ శరీరంలోని సున్నితమైన భాగాలను ఎవరైనా తాకేందుకు యత్నిస్తే ఎలా ప్రవర్తించాలో చెప్పాలి. పిల్లలతో రోజూ కొంత సమయం గడుపుతూ వారు చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలి. పిల్లలకు అవసరం లేకున్నా సెల్‌ఫోన్లు ఇవ్వొద్దు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం చేయాలి. దేనికి ఏ శిక్ష పడుతుందో అవగహన కల్పించాలి. టీవీ కార్యక్రమాలు, సినిమాల్లో అశ్లీలత పెరిగింది. సెల్‌ఫోన్ల ద్వారా శృంగార వీడియోలు చూడటం ఒకరి నుంచి మరొకరికి వ్యసనంగా మారుతోంది. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెడుతుండాలి.
తెలిసిన వారే ఎక్కువ..
జరుగుతున్న నేరాలను పరిశీలిస్తే బాలికలు ఒంటరిగా ఉండటం, వారిపై తెలిసినవారే అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసిపోతోంది. ఉమ్మడి కుటుంబాలు లేకపోవటం, కుటుంబంలో దంపతులిద్దరూ పనికి వెళ్లడం, చిన్నపిల్లల ఒంటరిగా వదిలేయక తప్పని పరిస్థితి. ఇదే అదనుగా మృగాళ్లు రెచ్చిపోతున్నారు.
అప్రమత్తతే ముఖ్యం..
బాలికలను ఒంటరిగా వదలకుండా ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల ప్రవర్తనలో సడెన్‌గా ఏమైనా తేడా వస్తే గమనించి, దానికి గల కారణాలను తెలుసుకోవాలి. పిల్లలకు ఏమైనా జరిగితే తల్లిదండ్రులతో చెప్పుకునే స్వేచ్ఛ కల్పించాలి. చట్టాలైతే కఠినంగా ఉన్నాయి గానీ, నేరాలు తగ్గాలి.
చట్టం అమలులో లోపాలు
నిర్భయ చట్టం వచ్చినా పటిష్టంగా అమలు జరగటంలేదు. ఇందులోనూ లోపాలు ఉన్నాయి. అరెస్టు చేసినా బెయిలపై బయటకు వచ్చేస్తున్నారు. దివ్యాంగులు, మైనర్లపైనా లైంగిక నేరాలు పెరగుతుండటం చూస్తుంటే భయం వేస్తోంది. అసిఫా, గీత ఇలా వరుస సంఘటనలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణం.
Comments
Please login to add a commentAdd a comment