పరిగి: రంగారెడ్డి జిల్లా పరిగి బస్టాండ్‌లో ఏడాదిన్న వయసున్న బాలుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం విడిచిపెట్టి వెళ్లిపోయారు. బస్టాండ్‌లో ఏడుస్తున్న చిన్నారిని ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలుడ్ని పోలీసులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. ఎవరు వదిలి వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.