bus station
-
పల్లెకు పోదాం చలో చలో (ఫొటోలు)
-
పండగొచ్చింది.. పల్లెబాట పట్టిన పట్నంవాసులు (ఫొటోలు)
-
తిరుపతిలో మోడల్ బస్ స్టేషన్
-
Ayodhya: రూ.400 కోట్లతో బస్‌స్టేషన్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రూ. 400 కోట్లతో బస్‌స్టేషన్ నిర్మించేందుకు సీఎం యోగి ఆదిత్యనాధ్ నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మాణం జరగనుందని మంత్రి సిద్దార్థ నాథ్ సింగ్ వెల్లడించారు. రామ మందిరానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారని, దాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు ఇందుకోసం 9 ఎకరాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు అవసరమైన అన్ని అవసరాలను పరిగణనలో ఉంచుకొని నిర్మాణం జరగనుందని స్పష్టం చేశారు. అయోధ్య–సుల్తాన్‌పుర్ రోడ్డులో నాలుగు లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మించనున్న దీనికి రూ. 20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీని పొడవు 1.5 కిలోమీటర్లు ఉంటుందని తెలిపింది. అలహాబాద్‌లో అనూప్‌షహార్–బులంద్‌షహర్‌ల మధ్య ఉన్న జీటీ రోడ్ వద్ద నాలుగు లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. చదవండి: అనుమతి వస్తే.. దేశంలో చిన్నారులకు తొలి కరోనా టీకా ఇదే! -
బస్టాండ్‌లో ప్రయాణికులే వీరి టార్గెట్
సాక్షి, రాజాం : బస్టాండ్లే వారికి ఆదాయ మార్గాలు. ఒంటరిగా బస్సు ఎక్కేవారే టార్గెట్. రద్దీగా ఉండే బస్సుల్లో ఎక్కేవారి చేతుల్లో ఉండే బ్యాగులు, నగదు కాజేయడంలో సిద్ధహస్తులు. ఇలా ఈ మధ్య కాలంలో రాజాం బస్టాండ్‌లో ఓ వ్యక్తి సంచిలో నుంచి దొంగిలించి పరారైన నిందితులను పోలీసులు చాకచక్యంగా బుధవారం పట్టుకున్నారు. రాజాం ఎస్ఐ కె.రాము నిందితులను విలేకరుల ముందు హాజరు పరిచి, వివరాలను వెల్లడించారు. ఈ నెల 10న విజయవాడకు చెందిన బట్టల వ్యాపారి పడాల నాగేశ్వరరావు రాజాంలో తన సొమ్ము కలెక్షన్ చేసుకుని, తిరుగు పయనమయ్యాడు. సాయంత్రం 6 గంటల సమయంలో విశాఖపట్నం బస్సు ఎక్కుతుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి వ్యాపారిని తత్తరపాటుకు గురిచేసి, చేతిలో ఉన్న బ్యాగును చాకచక్యంగా కాజేసి పరారయ్యారు. తేరుకున్ను నాగేశ్వరరావు.. తన బ్యాగులోని రూ.86,250లు అపరహరణకు గురయ్యాయని రాజాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, రంగంలోకి దిగిన పోలీసులు.. కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ పుటేజీలను పరిశీలించి, పరిసర ప్రాంతాలపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం బస్టాండ్‌లో అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ కె.రాము, క్రైం సిబ్బంది సీహెచ్ కృష్ణ, చౌదరి కృష్ణ, శంకరరావు బస్టాండ్‌కు చేరుకొని, చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు విశాఖపట్నంకు చెందిన బుర్లి సురేష్‌ప్రసాద్, గోపాలపట్నంకు చెందిన అరికట్ల తారకేశ్వరరావుగా గుర్తించి, మరిన్ని వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. అలాగే వీరి వద్ద నుంచి రూ.84,200లు స్వాధీనం చేసుకుని, రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించామని ఎస్ఐ వివరించారు. గతంలో విశాఖపట్నంలో కూడా వీరిపై పలు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. -
‘ఆలంబాగ్’ ఏమైనట్టు!
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లక్నోలో ఎంతోప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆలంబాగ్ దేశంలోనే ఒక మోడల్ బస్‌స్టేషన్. ఎయిర్‌పోర్టు తరహా సదుపాయాలను అందుబాటులో ఉంచారు. ఏసీ వెయిటింగ్ హాళ్లు,కెఫెటేరియాలు, ఎంటర్టైన్మెంట్,తదితర అన్ని వసతులతో రెండంతçస్తుల్లో దీనిని కట్టించారు. 49 ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి రోజు 3000 బస్సులు ఆలంబాగ్ నుంచి రాకపోకలు సాగిస్తాయి. సుమారు లక్షన్నర మందికి పైగా ప్రయాణికులు లక్నోతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లివస్తుంటారు. సాక్షి, సిటీబ్యూరో: అది నిజాం హయాంలో కట్టించిన చారిత్రాత్మక బస్సు స్టేషన్. అప్పటి వరకు అందుబాటులో ఉన్న సాంకేతికపరిజ్ఞానంతో పూర్తిగా ఐరన్‌తో ఒక విశాలమైన డోమ్ ఆకారంలో ఎంతో అద్భుతంగా కట్టించిన మిస్సిసిపి హ్యాంగర్ (సీబీఎస్)అది. అటు హైదరాబాద్ నుంచి ఇటు సికింద్రాబాద్‌కు బస్సుల రాకపోకలకు ఎంతో అనుకూలంగా మూసీ ఒడ్డున నిర్మించిన సెంట్రల్ బస్సు స్టేషన్ రెండేళ్ల క్రితమే చరిత్రలో కలిసిపోయింది. అప్పటికే శిథిలావస్థకు చేరిన ఆ బస్సు స్టేషన్ అకస్మాత్తుగా ఒకవైపు ఒరిగిపోవడంతో దానిని తొలగించారు. చారిత్రకవారసత్వ కట్టడాలను, నమూనాలను పరిరక్షించాలంటూఇంటాక్ వంటి సంస్థలు డిమాండ్ చేశాయి. కానీ ప్రయాణికుల భద్రత దృష్ట్యా దానిని తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి రవాణామంత్రి, ఉన్నతాధికారులు సైతం మిస్సిసిపి హ్యాంగర్‌ను సందర్శించారు. శిథిలాలను పరిశీలించారు. సుమారు ఎకరం స్థలంలో విస్తరించుకొని ఉన్న మిస్సిసిపి హ్యాంగర్ స్థానంలో అధునాతన సదుపాయాలతో సరికొత్త బస్‌స్టేషన్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. కానీ రెండేళ్లు దాటినా కొత్త బస్‌స్టేషన్ నిర్మాణంపై కదలిక లేదు. మరోవైపు ఆర్టీసీ సొంతంగా ఒక్క రూపా యి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా పబ్లిక్ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ‘ఆలంబాగ్’ తరహా మోడల్ బస్‌స్టేషన్ నిర్మించేందుకు అధికారులు రూపొందించిన వందలపేజీల నివేదికలపైన నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయి. ‘ఆలంబాగ్’ ఒక నమూనా... ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లక్నోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆలంబాగ్ దేశంలోనే ఒక మోడల్ బస్‌స్టేషన్. ఎయిర్‌పోర్టు తరహా సదుపాయాలను అందుబాటులో ఉంచారు. ఏసీ వెయిటింగ్ హాళ్లు, కెఫెటేరియాలు, ఎంటర్టైన్మెంట్, తదితర అన్ని సదుపాయాలతో రెండంతస్థుల్లో దీనిని కట్టించారు. 49 ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి రోజు 3000 బస్సులు ఆలంబాగ్ నుంచి రాకపోకలు సాగిస్తాయి. సుమారు లక్షన్నర మందికి పైగా ప్రయాణికులు లక్నోతో పాటు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. చారిత్రక లక్నో నగరం అందాన్ని ద్విగుణీకృతం చేసేవిధంగా ఎంతో అందంగా కట్టించిన ఈ బస్‌స్టేషన్‌లో 62 సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొదటి, రెండో అంతస్థుల్లో, గ్రౌండ్‌ఫ్లోర్‌లో వెయిటింగ్ హాళ్లు, రెస్ట్రూమ్లు, సురక్షితమైన తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. సుమారు 6 ఎకరాలు ఉన్న ఆలంబాగ్ బస్టేషన్ ప్రాంగణంలో 40 శాతం స్థలాన్ని స్టేషన్ నిర్మాణం కోసం వినియోగించగా, మరో 60 శాతం స్థలంలో 9 అంతస్థుల భవన సముదాయాలను కట్టించారు. భారీ షాపింగ్‌మాల్స్, సినిమాహాళ్లు వంటివి ఏర్పాటు చేశారు. ఇదంతా ‘డిజైన్, బిల్డ్,ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్ఫర్’ పద్ధతిలో షాలిమార్ గ్రూపు సంస్థ నిర్మించింది. అక్కడి ఆర్టీసీ ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా కట్టించిన ఈ భవనసముదాయాలపైన ఆర్టీసీకి ఏటా రూ.1.8 లక్షల ఆదాయం లభిస్తుంది. ప్రతి సంవత్సరం 5 శాతం చొప్పున ఈ ఆదాయం పెరుగుతుంది. పైగా నిర్మాణానికి ముందే ఆర్టీసీకి గుడ్‌విల్‌గా షాలిమార్ సంస్థ రూ.8 కోట్లు ఇచ్చేసింది. ఈ భవనాలను 32 ఏళ్లపాటు లీజుకు ఇచ్చారు. ఆ తరువాత ఈ భవనాలన్నీ ఆర్టీసీకే చెందుతాయి. ఇదే పద్ధతిలో హైదరాబాద్‌లో మిస్సిసిపి హ్యాంగర్ స్థానంలో కట్టించేందుకు సన్నాహాలు చేపట్టారు. మిస్సిసిపి హ్యాంగర్ స్థలంతో పాటు దాని చుట్టూ మొత్తం ఆర్టీసీకి అందుబాటులో ఉన్న 5 ఎకరాల విస్తీర్ణంలో బస్‌స్టేషన్, మాల్స్, సినిమాహాళ్లు వంటివి బిల్డ్ ఆపరేట్ ట్రాన్ఫర్ పద్ధతిలో కట్టించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు అధికారుల బృందం లక్నో సందర్శించింది. నివేదికను సైతం రూపొందించింది. అది అలాగే ఉండిపోయింది. కన్సల్టెన్సీ ఏర్పాటు చేయాలి.... ఆర్టీసీ అధికారుల నివేదిక ఆధారంగా మిసిసిపి హ్యాంగర్ వద్ద ఉన్న ఐదెకరాల స్థలంలో ఎలాంటి డిజైన్‌లో బస్‌స్టేషన్ కట్టించాలి. షాపింగ్‌మాల్స్, ఇతరత్రా భవనాల కోసం ఎంత స్థలం అందుబాటులో ఉంటుంది. బస్‌స్టేషన్ నిర్మాణం వల్ల ప్రయాణికులకు ఎలాంటి సదుపాయాలు ఏర్పడుతాయనే దానిపైన ఒక సమగ్రమైన ప్రణాళికనే రూపొందించేందుకు ఒక కన్సెల్టెన్సీని ఏర్పాటు చేయాలని భావించారు.ఈ కన్సల్టెన్సీ ప్రణాళికల ఆధారంగా బస్‌స్టేషన్ నిర్మించేందుకు ఆసక్తి ఉన్న కన్సార్టియంల నుంచి బిడ్లను ఆహ్వానించవలసి ఉంది. కానీ అప్పట్లో ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేశారు. మిస్సిసిపి హాంగర్ వద్ద కొత్త మోడల్ బస్‌స్టేషన్ నిర్మిస్తే అక్కడి నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు, ఇటు మెట్రో స్టేషన్‌కు స్కైవేలను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. కానీ ఆచరణలో అడుగు పడడం లేదు. -
విజయవాడలో కొత్త నోట్ల కలకలం
-
బస్టాండ్‌లో ఏడాదిన్నర బాలుడు
పరిగి: రంగారెడ్డి జిల్లా పరిగి బస్టాండ్‌లో ఏడాదిన్న వయసున్న బాలుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం విడిచిపెట్టి వెళ్లిపోయారు. బస్టాండ్‌లో ఏడుస్తున్న చిన్నారిని ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలుడ్ని పోలీసులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. ఎవరు వదిలి వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
‘సమ్మె’ పాట్లు యథాతథం!
నాల్గో రోజు రోడ్డెక్కిన బస్సులు 631 అన్ని డిపోల్లో కార్మికుల వంటా-వార్పు 8 ఎంఎంటీఎస్ {పత్యేక రైళ్లు నడిపిన ద.మ.రైల్వే మే 14న ఎంసెట్‌కు {పత్యేక బస్సులపై ఆర్టీఏ కసరత్తు నగరంలో ‘సమ్మె’ పాట్లు కొనసాగుతున్నాయి. శనివారం కూడా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ యూనియన్ల ఆధ్వర్యంలో అన్ని డిపోల ఎదుట వంటా వార్పు నిర్వహించి నిరసన తెలిపారు. యథావిధిగా ప్రైవేట్ వాహనదారుల దోపిడీ కొనసాగింది. సిటీబ్యూరో : నాలుగు రోజులుగా అదేసీన్. ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతుండగా మరోవైపు ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. శనివారం నగరంలోని 28 డిపోలు, ప్రధాన బస్స్టేషన్లలో కార్మిక సంఘాలు వంట-వార్పు నిర్వహించి తమ ఆందోళన కొనసాగించాయి. అన్ని చోట్ల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ డిపో వద్ద జరిగిన కార్యక్రమంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ చెర్మైన్ కోదండరామ్ పాల్గొని ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 43 శాతం ఫిట్మెంట్ న్యాయమైన డిమాండ్ అని, యాజమాన్యం ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం,సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన మహత్తర పోరాటాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నగరంలోని మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్లు, బర్కత్‌పురా, కాచిగూడ,పికెట్, హయత్‌నగర్, రాణిగంజ్, జీడిమెట్ల, కుషాయిగూడ తదితర అన్ని డిపోల వద్ద కార్మికులు వంటా వార్పు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు ప్రైవేట్ కండక్టర్లు, డ్రైవర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సహాయంతో 4వ రోజు 631 సిటీ బస్సులు రోడ్డెక్కినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో ఉదయం,సాయంత్రం రద్దీ వేళల్లో నగర వాసులకు కొద్దిగా ఊరట లభించినప్పటికీ ఇబ్బందులు మాత్రం తప్పలేదు. లక్షలాది మంది ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. దీంతో ఆటోవాలాలు, ప్రైవేట్ ఆపరేటర్ల దోపిడీ పర్వం యధావిధిగా కొనసాగింది. కిక్కిరిసిన ఎంఎంటీఎస్ రైళ్లు... బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ఎంఎంటీఎస్ రైళ్లలో రద్దీ నెలకొంది. దీంతో దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ-నిజామాబాద్, మల్కాజిగిరి-మిర్యాలగూడ మార్గంలోనూ ప్రత్యేక రైళ్లు నడిచాయి. వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలో అనూహ్యమైన రద్దీ నెలకొంది. ఇక దూరప్రాంతాలకు నడిచే ప్రైవేట్ బస్సుల్లో రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. ఒక్క బస్సులే కాకుండా కార్లు, టాటా ఏస్ వంటి వాహనదారులు సైతం నిలువుదోపిడీ కొనసాగించారు. ఎంసెట్‌కు 1000 బస్సులు: జేటీసీ రఘునాథ్ తెలంగాణలో ఈ నెల 14న ఎంసెట్ నేపథ్యంలో విద్యార్థులకు రవాణా సదుపాయాలపై ఆర్టీఏ అధికారులు శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటి వరకు కూడా కార్మికులు సమ్మె విరమించకుండా కొనసాగిస్తే చేపట్టవలసిన ఏర్పాట్లపై హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్ నేతృత్వంలో చర్చించారు. గ్రేటర్‌లోని 117 కేంద్రాల్లో ఇంజనీరింగ్, 30 కే ంద్రాల్లో మెడికల్ ఎంసెట్ పరీక్షలు జరుగనున్న దృష్ట్యా కనీసం 1000 బస్సులను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఆర్టీసీ బస్సులే కాకుండా, స్కూళ్లు, కళాశాలలు, కంపెనీలకు నడిచే బస్సులను కూడా సేకరించనున్నట్లు జేటీసీ రఘునాథ్ తెలిపారు. ఇప్పటి వరకు 500 మంది డ్రైవర్లను ఆర్టీసీకి అప్పగించినట్లు పేర్కొన్నారు. నగరంలో నడిచేందుకు ప్రైవేట్ బస్సులకు రూ.100 ల ఫీజుతో తాత్కాలిక పర్మిట్లను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె దృష్ట్యా ఎంసెట్‌కు రవాణా సదుపాయాలపై మే 13వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. -
రెండో రోజూ ‘బస్సు’ బంద్ ఉద్రిక్తత
- తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో రోడ్డెక్కిన బస్సులు - కార్మికుల కన్నెర్ర.. అడ్డుకున్న సిబ్బంది.. - టైర్లలో గాలి తీసివేత.. బస్సు అద్దాలు ధ్వంసం - కానిస్టేబుల్‌కు గాయూలు.. చెదరగొట్టిన పోలీసులు.. - ఆర్టీసీ జేఏసీ భారీ ర్యాలీ.. పోలీసుల అదుపులో కొందరు కార్మికులు హన్మకొండ : ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా రెండోరోజు గురువారం చేపట్టిన బస్సుల బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. పూర్తిస్థారుులో బస్సు సర్వీసులు నిలిచిపోరునప్పటికీ... తాత్కాలిక ఉద్యోగులను తీసుకోవడం, అద్దె బస్సులు నడిపించడంపై కార్మికులు కన్నెర్ర చేశారు. సమ్మెలో భాగంగా హన్మకొండ డిపో నుంచి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం కూడలి, పెట్రోల్ పంప్, హన్మకొండ చౌరస్తా మీదుగా వరంగల్-2 డిపో ముందు నుంచి హన్మకొండ జిల్లా స్టేషన్‌కు ర్యాలీ చేరుకుంది. జిల్లా బస్‌స్టేషన్‌లోకి ర్యాలీగా వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఇదే క్రమంలో వరంగల్-2 డిపోకు చెందిన బస్సు ఇటు వైపు రావడంతోవారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మహిళా కార్మికులు బస్సులకు అడ్డంగా బైఠాయించగా... కొందరు ఆర్టీసీ సిబ్బంది నడుస్తున్న బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో వరంగల్-2 డిపోకు చెందిన ఓ అద్దె బస్సు అద్దాలు పగిలాయి. బందోబస్తులో ఉన్న ఓ కానిస్టేబుల్‌కు రాయి తగలడంతో స్వల్పంగా గాయమైంది. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు చెదరగొట్టారు. రాళ్లు విసిరాడంటూ ఆర్టీసీ కార్మికుడు అలీని పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించేందుకు వాహనంలోకి ఎక్కించడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసు వాహనాన్ని కార్మికులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. ఇదే క్రమంలో జగిత్యాల డిపోకు చెందిన రెండు అద్దె బస్సులు రావడంతో కార్మికులు ఆ బస్సులనూ అడ్డగించారు. మహిళా కార్మికులు బస్సుల ముందు బైఠాయించారు. కొంత మంది బస్సుల టైర్లలో గాలి తీశారు. పోలీసులు అదుపులోకి తీసుకొన్న కార్మికుడిని వదిలేయడంతో కార్మికులు శాంతించారు. అనంతరం బస్‌స్టేషన్ ద్వారం వద్ద కార్మికులు టైర్లకు నిప్పంటించి నిరసన తెలిపారు. ర్యాలీలో ఆర్టీసీ జేఏసీ నాయకులు ఈఎస్ బాబు, జితేందర్‌రెడ్డి, సిహెచ్ యాకస్వామి, ఈదురు వెంకన్న, మనోహర్, సీహెచ్.రాంచందర్, యాదయ్య, యాదగిరి, ఎండీ.గౌస్. కేడీ.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు రూ.కోటి నష్టం జిల్లాలోని తొమ్మిది డిపోల్లో 965 బస్సులు ఉన్నారు. ఇందులో 758 సంస్థ బస్సులు, 207 అద్దె బస్సులు. ఇందులో సంస్థకు చెందిన 12 ఆర్టీసీ బస్సులను తాత్కాలి డ్రైవర్లు, కండక్టర్ల సహాయంతో బయటకు వెళ్లాయి. 142 అద్దె బస్సులు తిరిగినట్లు అధికారులు తెలిపారు. వరంగల్ రీజియన్‌లో మొత్తం 4539 మంది కార్మికులు, ఉద్యోగులు, సూపర్వైజర్లు, మెకానిక్‌లు సమ్మెలో పాల్గొన్నారు. ఇందులో కండక్టర్లు, డ్రైవర్లు 3605 మంది ఉండగా... మిగతా వారు సూపర్ వైజర్లు, మెకానిక్‌లు, డీసీలు, ఏడీసీలు, ఇతర ఉద్యోగులున్నారు. సమ్మెతో రెండో రోజు దాదాపు రూ.98 లక్షల నుంచి రూ.కోటి వరకు సంస్థ ఆదాయాన్ని కోల్పోయింది. తాత్కాలికంగా హన్మకొండ నుంచి పరకాల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, జనగామ, హైదరాబాద్, కరీంనగర్ రూట్లలో నడిపినట్లు ఆర్టీసీ ఆర్ఎం యాదగిరి తెలిపారు. ఫలించని అధికారుల వ్యూహం ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైనప్పటికీ... గురువారం పూర్తిస్థాయిలో బస్సులు నడుపలేకపోయూరు. బుధవారం తాత్కాలిక డ్రైవర్లుగా 30 మందిని ఎంపిక చేసి డిపోలకు కేటాయించినప్పటికీ... గురువారం 12 మంది మాత్రమే విధులకు హాజరయ్యారు. దీంతో మరో 12 మంది తాత్కాలిక కండక్టర్లను విధుల్లోకి తీసుకుని 12 బస్సులు నడిపారు. గురువారం మరో 40 మంది తాత్కాలిక డ్రైవర్లకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించారు. ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సు యజమానులకే పూర్తి స్వేచ్ఛను వదిలేసింది. దీంతో కొంత మంది అద్దె బస్సు యజమానులు బస్సులను తిప్పారు. బస్‌స్టేషన్ ప్రాంతాలకు బస్సులు వెళ్లే ఇబ్బందులు తప్పవని భావించిన అద్దె బస్సు యజమానులు బస్స్టేషన్లకు కొంచెం దూరంలో ప్రధాన కూడళ్లలో ప్రయాణికులను దింపి, ఎక్కించుకొని వెళుతున్నారు. అరుుతే కార్మికులు అడ్డుకుంటారని, నష్టం చేస్తారనే భయంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. సంఘీభావాల వెల్లువ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్ళపల్లి శ్రీనివాస్‌రావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పనాసా ప్రసాద్,నాయకుడు సిరబోయిన కర్ణాకర్ సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని మార్తినేని ధర్మారావు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. కార్మికుల పోరాటానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తక్కళ్ళపల్లి శ్రీనివాస్‌రావు అన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా సమస్యను పరిష్కరించాలన్నారు. -
పోలీస్ అలర్ట్
మావోయిస్ట్ వారోత్సవాల నేపథ్యంలో అప్రమత్తమైన ► జిల్లా పోలీసులుగుంటూరులోని బస్‌స్టేషన్, రైల్వే స్టేషన్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ►అదే సందర్భంగా గుంటూరులో తుపాకీ కలకలంతో ఉలికిపాటు ►నల్లమలలోనూ కొనసాగుతున్న కూంబింగ్ సాక్షి, గుంటూరు: జిల్లా పోలీసులు ఆదివారం రాత్రినుంచి ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రోడ్లపై వాహనాలు తనిఖీ చేస్తూ, అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తూ.. మావోయిస్ట్ కదలికలపై ఆరా తీస్తున్నారు. గుంటూరు నగరంలోనైతే బస్‌స్టాండ్, రైల్వేస్టేషన్లలో బాంబ్, డాగ్ స్క్వాడ్లతో అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసులు చేస్తున్న హడావుడి చూసి ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు, స్థానికులు, వ్యాపారులు హడలిపోయారు. అసలు పోలీసులు ఇంత హడావుడి ఎందుకు చేశారంటే ఈ నెల 28 నుంచి మావోయిస్ట్ వారోత్సవాలు జరుగుతుండటమే. దీనిపై ఇంటెలిజెన్స్, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీరంతా అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉంటే గుంటూరు నగరంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి తుపాకీ వదలి వెళ్ళడంతో ఇదేమైనా మావోయిస్ట్‌ల పనా.. అనే దానిపైనా పోలీసులు ఆరా తీశారు. హైదరాబాద్‌లోని ఇంటెలిజెన్స్ డీజీ కార్యాలయం నుంచి ఉపాకీ గురించి వివరాలు అడగడంతో అర్బన్ ఓఎస్డీ జగన్నాథ్‌రెడ్డి హుటాహుటిన అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తుపాకీని పరిశీలించి, అది ఎయిర్‌గన్ అని తెలుసుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఊపిరి పీల్చుకున్నారు. గత నెలలో ఎన్కౌంటర్ కూడా కారణమే... జిల్లాలో మావోయిస్ట్ కదలికలు లేవని చెబుతూనే గత నెలలో నల్లమల అటవీ ప్రాంతంలోని గుంటూరు- ప్రకాశం బోర్డర్లో గుంటూరు ఏఎన్ఎస్ పోలీసులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్ట్ ముఖ్య నేతలు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో మావోయిస్ట్ జిల్లాకమిటీ సభ్యుడు జాన్ బాబూరావుతోపాటు విమల, భారతి అలియాస్ నిర్మల అనే ముగ్గురు మావోయిస్ట్‌లు మృతిచెందారు. ఈ ఎదురు కాల్పుల్లో మరో మావోయిస్ట్ విక్రమ్‌కు తీవ్ర గాయాలైనప్పటికీ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పోలీసులు నల్లమలను జల్లెడపడుతున్నప్పటికీ ఇంత వరకూ విక్రమ్ ఆచూకీ మాత్రం కనిపించలేదు. దీనికితోడు జాన్ బాబూరావు రిక్రూమెంట్ చేసేందుకే బయటకు వచ్చాడని తేలడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఆగస్టు మూడు వరకూ వారోత్సవాలు ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్ట్ వారోత్సవాలు నిర్వహించాలని అగ్రనేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారుల ఆదేశాలతో జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. మండల కేంద్రాల్లో పోలీసులు రోడ్లపై వాహనాలను తనిఖీ చేస్తూ నాకా బంధీ నిర్వహించారు. గ్రామాల్లో మావోయిస్ట్ సానుభూతిపరులుగా అనుమానం ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచారు. గుంటూరు నగరంలోని రైల్వేస్టేషన్, బస్స్టేషన్లలో ఫ్లాట్పామ్లు, పార్శిల్ కార్యాలయం, వ్యాపార సముదాయాల్లో డాగ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. -
సొంత ఊళ్లకు పయనం
సాక్షి, సిటీబ్యూరో : సొంత ఊళ్లలో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు మూడు రోజులుగా సీమాంధ్రకు తరలివెళ్తున్న ప్రయాణికుల రద్దీ మంగళవారం తారాస్థాయికి చేరుకుంది. బుధవారం ఎన్నికలు కావడంతో నగరవాసులు భారీ సంఖ్యలో బయలుదేరారు. దీంతో నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు కిటకిటలాడాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేకంగా బందోబస్తును ఏర్పాటు చేశారు. బస్సులు, రైళ్లలోనే కాకుండా లక్షలాది మంది ప్రజలు సొంత వాహనాలు, ట్యాక్సీల్లో బయలుదేరి వెళ్లారు. మూడు రోజులుగా చార్జీలు రెట్టింపు చేసిన ప్రైవేట్ ఆపరేటర్లు మంగళవారం కూడా దోపిడీ కొనసాగించారు. అయితే పోటీలో ఉన్న అభ్యర్థులే ప్రయాణ చార్జీలను భరిస్తుండడంతో ప్రయాణికులు చార్జీలు రెట్టింపయినా లెక్క చేయకుండా బయలుదేరారు. మంగళవారం ఒక్క రోజే సుమారు ఐదు లక్షల మంది బయలుదేరినట్లు అంచనా. కిక్కిరిసిన ఎంజీబీఎస్ ... మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసింది. రోజూ నడిచే 850 దూరప్రాంత బస్సులతో పాటు, మంగళవారం మరో 700 బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, కడప, నె ల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు ప్రయాణికులు బయలుదేరి వెళ్లారు. ప్రైవేట్ బస్సులు సైతం కిటకిటలాడాయి. కూకట్‌పల్లిహౌసింగ్‌బోర్డు, అమీర్‌పేట్, లక్డీకాపూల్, కోఠి, అబిడ్స్, దిల్సుఖ్నగర్, వనస్థలిపురం, తదితర ప్రాంతాల నుంచి ప్రైవేట్ బస్సులు బయలుదేరాయి. ప్రయాణికుల ధర్నా.. సికింద్రాబాద్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు వెళ్లే ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ల వద్ద గందరగోళం నెలకొంది. వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు, రిజర్వేషన్ నిర్ధరణకాని వాళ్లు, జనరల్ బోగీ ప్రయాణికుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో వారిని స్లీపర్‌క్లాస్ బోగీల్లోకి అనుమతించారు. దీంతో అప్పటికే స్లీపర్‌క్లాస్‌లో రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సాధారణ ప్రయాణికులంతా బోగీల్లోకి ఎక్కేయగా రిజర్వేషన్ ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌పైనే ఉండిపోవలసి వచ్చింది. విశాఖకు వెళ్లవలసిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ఇలాంటి పరిస్థితే చోటుచేసుకుంది. కొంతమంది టీసీలు ప్రయాణికుల వద్ద అదనపు డబ్బులు తీసుకొని ఎస్-6 బోగీలోకి సాధారణ ప్రయాణికులను ఎక్కించడంతో 30 మందికి పైగా రిజర్వేషన్ ప్రయాణికులు స్టేషన్ మేనేజర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. దీంతో మరో రైలులో వారిని విశాఖకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎంజీబీఎస్ వద్ద ప్రయాణికుల అభిప్రాయాలు.. ఓటు వేసేందుకు వచ్చా.. నేను మహారాష్ట్ర ఉద్దిర్లో వ్యాపారం చేస్తున్నా. ఎన్నికల్లో ఓటు వేసేందుకు వ్యాపారాన్ని మానుకుని మా స్వస్థలమైన చిత్తూరు జిల్లా కలకడ మండలం, కోన గ్రామానికి వెళ్తున్నా. - నాగస్వామి నాయక్ బంధువులతో కలిసి.. పదేళ్ల క్రితం రాజమండ్రి నుంచి నగరానికి వచ్చి రంగారెడ్డి జిల్లా యమన్నగర్లో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాం. ఎన్నికల్లో ఓటు వేసేందుకు మా బంధువులతో కలిసి రాజమండ్రికి వెళ్తున్నా. - ఎండపల్లి వీరవేణి పనిమానేసి వెళ్తున్నా.. కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి శంషాబాద్‌లో భవన నిర్మాణ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నా. మా స్వస్థలమైన కావలి (నెల్లూరు జిల్లా) లో ఓటు వేసేందుకు పనిమానేసి వెళ్తున్నా. - శ్రీనివాస్, శంషాబాద్ -
అమ్మా! ‘కని’కరించు..
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : మానవత్వం మంటగలుస్తోంది. ఆడపిల్ల పుట్టగానే వదిలించుకుంటున్నారు. జన్మనిచ్చే ‘అమ్మ’నే ఆమడదూరంలో పడేస్తున్నారు. బొడ్డుపేగు తెగక ముందే అనాథలుగా మారుస్తున్నారు. కళ్లు తెరవక ముందే మాతృప్రేమను పంచకుండా చెత్తకుప్పలు, ఆస్పత్రుల ఆవరణలు, రైల్వే, బస్స్టేషన్లలో వదిలేస్తున్నారు. కొందరు శిశువులు ఎక్కిఎక్కి ఏడ్చి కన్ను మూస్తున్నారు.. మరికొందరిని శునకాలు, వరాహాలు పిక్కుతింటున్నాయి.. భూమిపై నూకలు ఉన్నవారు అదృష్టవశాత్తు దొరుకుతున్నారు. ఇదిలా ఉండగా, కొందరు తల్లిదండ్రులు ఆర్థికభారంతో తిండి పెట్టలేక, పెంచే స్థోమత లేక తమ పిల్లలను బస్, రైల్వేస్టేషన్, దేవాలయాల వద్ద వదిలేస్తున్నారు. ఇందులోనూ ఆడ శిశువులే అధికం. వీరిని అధికారులు శిశువిహార్‌లకు తరలిస్తున్నారు. గత మూడేళ్లలో జిల్లాలో 14 మంది శిశులు దొరుకగా ఇందులో ఎనిమిది మంది ఆడ శిశువులే ఉండటం దురదృష్టకరం. ఇంకా 32 మంది శిశువు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎందుకీ దుస్థితి.. ప్రధానంగా వివాహేతర సంబంధాలు, పెళ్లి కాకుండానే తల్లులు అవడం, ఆధునిక పోకడల పేరిట డేటింగ్ చేయడం, ప్రేమపేరుతో శారీరక అవసరాలు తీర్చుకోవడం చెప్పుకోవచ్చు. ఇలా పుట్టిన బిడ్డలతో సమాజంలో పరువుపోతుందని, తల్లిదండ్రులు మందలిస్తారని చంటి పిల్లలను పడేస్తున్నారు. ఇటువంటి ఘటనలకు కారణమెవరు? సమాజమా? పేదరికమా? తెలిసి తెలియని వయసులో తప్పు చేస్తున్న యువతదా? ఎవరిది తప్పయిన శిక్ష అనుభవిస్తున్నది మాత్రం ముక్క పచ్చలారని చిన్నారులే. వీరిని అనాథలుగానైనా బతకనివ్వండి. శిశుగృహాలకు అప్పగించండి. అక్కడైనా బతుకుతారు. అన్ని రకాల వసతి, రక్షణ కల్పించి వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తారు. ఒక వేళ పిల్లలు లేనివారు పెంచుకుంటామని వస్తే దత్తత ఇస్తారు. ఆ విధంగానైనా బిడ్డలు బతుకుతారు. ఆడపిల్ల ‘లక్ష్మీదేవి’తో సమానం.. ఆడపిల్ల పుడితే చాలామంది లక్ష్మీదేవి పుట్టిందంటారు. ఇది అన్నిచోట్ల కాదు. నేటికి చాలా మంది తమకు పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలిసి గర్భంలోనే చిదిమేస్తున్నారు. ఆ సమయం మించిపోతే పుట్టిన వెంటనే వదిలించుకుంటున్నారు. చాలా మందికి సంతానం లేక మానసికంగా కుంగిపోతుంటారు. తమకు పిల్లలు కలగాలని వెళ్లని ఆస్పత్రి, మొక్కని దేవుళ్లు ఉండరు. సంతానం లేని వారు అయ్యో తమకు పిల్లలు కలగడం లేదనే ఆవేదన పడుతుంటే మరికొందరు ఇలా పుట్టిన బిడ్డలను రోడ్డుమీద పడేయడంపై బాధాకరం. మీకు అవసరం లేకపోతే చైల్డ్‌లైన్ టోల్‌ఫ్రీ నంబర్ 1098కు ఫోన్ చేయండి. ఫిర్యాదు చేయవచ్చు.. చెత్తకుప్పలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద పిల్లలను వదిలేసి వెళ్లిన వారిపై చర్యలు ఉంటాయి. అటువంటి వారిపై బంధువులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఫిర్యాదు చేసినట్లయితే పోలీసులు చర్యలు తీసుకుంటారు. నిందితులపై కేసు నమోదు చేస్తారు. వీరికి జరినామా, శిక్ష పడతాయి. -
సమైక్యం కోసం అనంతలోకాలకు..
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ప్రకటనపై కలతతో ఆర్టీసీ నెల్లూరు-1 డిపో డ్రైవర్ నూతక్కి రాములు (47) శనివారం ఉదయం నెల్లూరులోని సరస్వతినగర్‌లో తన నివాసంలో మృతి చెందారు. దినపత్రికలో ఉద్యమ వార్తలు చదువుతూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు.కుటుంబ సభ్యులు తేరుకుని వైద్యులను సంప్రదించారు. రాములును వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. రాములు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎన్జీఓలు, ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. శిబిరం వద్దకు ఊరేగింపుగా.. రాములు మృతదేహాన్ని సరస్వతినగర్‌లోని ఆయన నివాసం నుంచి బస్‌స్టేషన్ ప్రాంగణంలోని శిబిరం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఎన్జీఓలు, ఆర్టీసీ కార్మికులు పెద్దసంఖ్యలో శిబిరం వద్దకు చేరుకుని రాములుకు నివాళులర్పించారు. ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్ సుధాకర్‌రావు మాట్లాడుతూ బట్టా శంకరయ్య, సీహెచ్ సోమశేఖరరావు, సత్యనారాయణ, రాములు ఇలా ఎంత మంది అసువులు బాసిన కేంద్రం కళ్లు తెరవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి త్యాగాన్ని వృథాకానివ్వబోమని ప్రతినబూనారు. మృతదేహాన్ని రాములు సోదరుడి ఇంటికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. కార్యక్రమంలో కె.రమణరాజు, వి.పెంచలరెడ్డి, నారాయణరావు, మహబు, డీబీ శామ్యూల్, సీహెచ్ శ్రీనివాసులు, ఏఎస్ఆర్ కుమార్, శేఖర్, శశి, రమేష్‌రెడ్డి, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖుల నివాళి దీక్షా శిబిరంలో రాములు మృతదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, ఆర్టీసీ ఆర్ఎం చింతా రవికుమార్, డిప్యూటీ సీటీఎం పి.చంద్రశేఖర్, నెల్లూరు -1, 2 డిపో మేనేజర్లు ఎ.సుబ్రహ్మణ్యం, ఎస్కే షమీమ్ సందర్శించి నివాళులర్పించారు. సమైక్యభేరి నుంచి ఇంటికెళుతూ.. సంగం: మండలంలోని ఉడ్‌హౌస్‌పేటకు చెందిన ఉక్కాల రవి(42) వ్యవసాయ కూలీ. ఆయనకు మొదటి నుంచి సామాజిక చైతన్యం ఎక్కువ. విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి సీమాంధ్రుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు నిరసన కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించేవాడు. అందులో భాగంగా శుక్రవారం బుచ్చిరెడ్డిపాళెంలో నిర్వహించిన సమైక్యభేరి సభకు హాజరయ్యాడు. సమైక్య నినాదాలతో హోరెత్తించాడు. అనంతరం ఇంటికి వెళుతూ తరుణవాయి వద్ద గుండెపోటుతో అపస్మారస్థితికి చేరుకున్నాడు. గ్రామస్తులు ఇంటికి తీసుకెళ్లేలోపు ప్రాణాలు కోల్పోయాడు. రవికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం సంగం తహశీల్దార్ శ్రీకాంత్, చిల్లకూరు ఎంపీడీఓ చిరంజీవి, జేఏసీ నాయకులు సురేంద్రరెడ్డి, ప్రభాకర్ తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతదేహంపై సమైక్యాంధ్ర జెండాను ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు.