అమ్మకానికి ఆడశిశువు.. గుట్టు రట్టు | parents try to girl child for sale.. caught by police | Sakshi
Sakshi News home page

అమ్మకానికి ఆడశిశువు.. గుట్టు రట్టు

Published Thu, Mar 2 2017 8:05 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

అమ్మకానికి ఆడశిశువు.. గుట్టు రట్టు - Sakshi

అమ్మకానికి ఆడశిశువు.. గుట్టు రట్టు

రంగారెడ్డి: ఆడశిశువును అమ్మకానికి పెట్టిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నంలో మూడు నెలల శిశువును ఓ తల్లిదండ్రులు అమ్మకానికి పెట్టారు. అనూహ్యంగా పోలీసులు దాడులు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సత్యం తండాకు చెందిన ఓ తల్లిదండ్రులకు ఇది వరకు ముగ్గురు కూతుర్లు. తాజాగా మరోసారి కూతురు జన్మించింది.

దీంతో నాలుగోసారి కూడా తమకు ఆడపిల్ల పుట్టిందని భావించిన వారు ఆ పసికందును అమ్మకానికి పెట్టేందుకు నిర్ణయించారు. రూ.35వేలకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. వారు చేస్తున్న ఈ నిర్వహకానికి స్వయానా ఆస్పత్రి సిబ్బందే మధ్యవర్తిగా వ్యవహరించింది. ఎస్‌ఓటీ పోలీసుల దాడి వల్లే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రి సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement